Kalki 2898 AD  : ప్రభాస్ ‘కల్కి 2898 – AD’ టీజర్ లో కమల్ హాసన్ ని ఎవరైనా గమనించారా..?

- Advertisement -

Kalki 2898 AD : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ప్రాజెక్ట్ K’ అలియాస్ ‘కల్కి 2898 – AD’ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని ఈరోజు కామిక్ కాన్ ఈవెంట్ లో తెల్లవారుజామున 1 గంట సమయం లో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్లిమ్స్ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఈ రేంజ్ ఔట్పుట్ ఊహించలేదని, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ది బెస్ట్ చిత్రం ఇదే అవుతుందని ఈ సందర్భంగా అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

Kalki 2898 AD
Kalki 2898 AD 

ఇక పోతే ఈ గ్లిమ్స్ వీడియో ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరిలో కలిగిన సందేహం, కమల్ హాసన్ ఎక్కడ?, చాలా రోజులక్రితమే ఈ చిత్రం లో కమల్ హాసన్ ఒక ముఖ్య పాత్రని పోషించబోతున్నాడని, త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నారు అంటూ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Kamal Haasan

అయితే చాలా రోజుల క్రితమే కమల్ హాసన్ టెస్ట్ షూట్ లో కూడా పాల్గొన్నాడు, కాని ఆయనకీ సంబంధించిన చిన్న షాట్ కూడా గ్లిమ్స్ వీడియో లో లేదు. కామిక్ కాన్ వేదిక పై రానా దగ్గుపాటి కూడా డైరెక్టర్ నాగ అశ్విన్ ని అదే అడుగుతాడు. ఈ గ్లిమ్స్ వీడియో లో కమల్ హాసన్ ఎక్కడ అని అడగగా, దానికి నాగ అశ్విన్ సమాధానం చెప్తూ ‘ గ్లిమ్స్ మొత్తం ఆయనే ఉన్నాడు..మీరే గమనించలేదు’ అని షాకింగ్ సమాధానం ఇచ్చాడు.

- Advertisement -
Prabhas kamal hassan

దీంతో అభిమానులు కమల్ హాసన్ అసలు ఈ వీడియో లో ఎక్కడ ఉన్నాడబ్బా అని మళ్ళీ మళ్ళీ గ్లిమ్స్ ని చూసారు. కానీ కమల్ హాసన్ కనిపించలేదు. దీంతో డైరెక్టర్ దేనిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు, ఎందుకు అలా అన్నాడు అని జుట్టు పీక్కుంటున్నారు. అయితే కమల్ హాసన్ ఇందులో సైంటిస్ట్ గా నటించబోతున్నాడని, ఆయనే టైం ట్రావెల్ ని కనిపెట్టాడని, డైరెక్టర్ ఆ ఉద్దేశ్యం తోనే అలా కామెంట్ చేసి ఉండొచ్చు అని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.మరి మీ ఉద్దేశ్యం లో డైరెక్టర్ కామెంట్స్ ద్వారా ఏమి క్లూ దొరికిందో క్రింద కామెంట్స్ లో చెప్పండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here