Actress : టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా, అనుష్క శెట్టి వీళ్లంతా స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్ స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రజెజ్స్‌కి అందరూ ఫిదా అవుతుంటారు. కానీ వీరు కెరీర్ లో సక్సెస్ అవ్వడంలో ఎక్కువ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల గురించి పెద్దగా తెలుసుకోరు. ముఖ్యంగా అనుష్క, కాజల్ లాంటి వారికి అసలు తెలుగు సరిగ్గా రాదు. అప్పుడు కచ్చితంగా వారికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. వీరి కెరీర్లో చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్లకి డబ్బింగ్ చెప్తూ ఉంటారు.
కానీ.. డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌమ్య శర్మ చెప్పినట్లు డబ్బింగ్ మిగతా వారెవరూ మ్యాచ్ చేయలేరు. ఇంతకీ అసలు ఎవరి సౌమ్య శర్మ.. ఏ సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. రవితేజ విక్రమార్కుడు సినిమాలో అనుష్కకు తొలిసారి డబ్బింగ్ చెప్పింది ఆర్‌జె సౌమ్య శర్మ. ఆ తర్వాత సూపర్ మూవీలో ఆయేషా టకియా కి డబ్బింగ్ చెప్పింది. అలాగే ఛత్రపతి సినిమాలో శ్రియకు, లక్ష్మీ సినిమాలో నయనతార కి డబ్బింగ్ చెప్పింది. అయితే ఇలా ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన సౌమ్య శర్మకు.. లక్ష్యం సినిమాల్లో అనుష్కకు డబ్బింగ్ చెప్పినందుకు గాను బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు దక్కింది.
సౌమ్య శర్మ ఆర్జేగా కెరీర్ మొదలు పెట్టి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. స్క్రిప్ట్ రైటర్ గా కూడా సరే జాను, అమెరికా అమ్మాయి లాంటి పాపులర్ టీవీ సీరియల్ లకు అద్భుతమైన స్క్రిప్ట్ అందించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఓ టాలీవుడ్ డైరెక్టర్ భార్య అన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. ఆయన ఎవరో కాదు సిద్ధార్థ నటించిన ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా. 2010లో ఈ జంట వివాహం చేసుకున్నారు. తర్వాత కూడా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల ద్వారా తన వాయిస్ తో ఆకట్టుకుంది.