గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని వారుండరు. సినీ పరిశ్రమలో ఓటమే ఎరుగని దర్శకుడు రాజమౌళి. జక్కన్నగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పెద్ద పెద్ద స్టార్లు రాజమౌళితో సినిమా చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చిన్న హీరోలను కూడా స్టార్లను చేసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి.

అలాంటి రాజమౌళి దర్శకత్వంలో నటించిన వారు ప్రస్తుతం గ్లోబల్ స్టార్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలలో తన ఇష్టమైన హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని ఆయన స్వయంగా బయటపెట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తనకు ఇష్టమైన హీరోయిన్స్ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి జక్కన్నకు అంతగా ఇష్టమైన హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు సదరు ఇంటర్వ్యూయర్ రాజమౌళిని.. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడిగారు. అందుకు బదులుగా రాజమౌళి ఇలా స్పందిస్తూ తనకు స్వీటీ(హీరోయిన్ అనుష్క) అంటే చాలా ఇష్టమని చెప్పారు. తన డెడికేషన్, ఆమె వర్క్ పట్ల చాలా సీరియస్ నెస్ చూస్తే చాలా ముచ్చట వేస్తుందని చెప్పాడు. ఆమెకు ప్రొఫైల్ ఇజం చాలా ఉందన్నాడు. అనుష్క రాజమౌళి దర్శకత్వంలో మొదట విక్రమార్కుడు సినిమాలో తరువాత బాహుబలి సిరీస్లో నటించింది.

ఇక అనుష్క తర్వాత మర్యాద రామన్న సినిమాలో నటించిన హీరోయిన్ సలోని అంటే ఇష్టమని తెలిపాడు. ఆమె కూడా ప్రొఫెషనల్ అని సిన్సియర్ అని చెప్పాడు. తను చాలా మంచి నటి అంటూ కూడా కితాబు కూడా ఇచ్చాడు రాజమౌళి. ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా పబ్లిక్ గా చెప్పే అంత మూర్ఖుడిని కాదంటూ తెలివిగా తప్పించుకున్నాడు. దీంతో రాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరై ఉంటారని పలువురు ఆలోచిస్తున్నారు.