Kajal Agarwal : పెళ్లికి ముందే ఆ స్టార్ హీరోతో కాజల్.. ఇన్నాళ్లు బయటపడని నిజంసినిమా ఇండస్ట్రీలో ప్రేమ, డేటింగ్, పెళ్లి, విడాకులు సర్వసాధారణం. చాలా మంది స్టార్ సెలబ్రిటీలు సినిమాలు చేస్తూనే ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కొందరు పెళ్లి చేసుకుంటే.. మరికొందరు ప్రేమతో విడిపోయి బై బై అంటున్నారు. అలాంటి జాబితాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా చేరింది. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన శైలిలో ముందుకు సాగింది.
మగధీర సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ తరుణంలో ఆమె రామ్‌చరణ్‌తో ప్రేమలో పడిందనే వార్త వైరల్‌గా మారింది. సినిమా షూటింగ్‌తో పాటు బయట వాళ్లిద్దరూ ఉన్న ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వీరి కాంబోలో మెరుపు సినిమా కమిట్ అయి ఆగిపోయింది. ఆ తర్వాత వీరి కాంబోలో రెండు మూడు సినిమాలు రావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల కమిట్ అయినట్లే అయి వెంటనే మిస్సయ్యాయి. ఆ తర్వాత కాజల్-చరణ్ బాగా దగ్గరయ్యారు. పెళ్లి సమయంలో ఆమె డైమండ్ రింగ్‌ని బహుమతిగా ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు పెళ్లయ్యాక కూడా అలాగే ఉంటామని చెబుతూ వచ్చారు. అయితే ఆచార్య సినిమాలో కూడా కొరటాల శివకు చెప్పి కాజల్ పేరును చరణ్ సూచించాడట. ఆమె కూడా ఆ సినిమాకు కమిట్ అయ్యి ఆ తర్వాత వదులుకోవాల్సి వచ్చింది. అందుకే చరణ్ కాజల్ అగర్వాల్ ప్రేమలో ఉందనే వార్త బాగా ట్రెండ్ అయ్యింది..!!