Pushpa 2 : పుష్పరాజ్‏కు నయా స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా..?.. తన బ్యాక్ గ్రౌండ్ ఇదే?

- Advertisement -

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. దాంతో పాటు ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ హైప్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. దీంతో పుష్ప ది రూల్ విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈసినిమా కోసం సౌత్, నార్త్ అడియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై హైప్ ను బాగా పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా నిలిచింది.

దాంతో పాటు మే 1న రిలీజ్ అయిన ‘పుష్ప పుష్ప’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పుష్ప.. పుష్ప అంటూ సాగే పాటలో బన్నీ డాన్స్.. పుష్పరాజ్ మ్యానరిజం అదరహో అనిపించేలా ఉంది. ముఖ్యంగా ఈ పాటలో బన్నీ వేసిన ఓ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. గతంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటలో నడుస్తూ చెప్పు వదిలేసిన స్టెప్ ఎంతగా పాపులర్ అయ్యిందో.. మళ్లీ ఇప్పుడు పుష్ప 2లోని షూ వదిలేసే స్టెప్ కూడా అంతే పాపులర్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప పాటకు డ్యాన్స్ చేస్తూ షూ స్టెప్ వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన అదే స్టెప్ వేస్తు కనిపిస్తున్నారు జనాలు. మరోసారి నెట్టింట షూ వదిలేసిన స్టెప్ వైరలవుతుంది.

- Advertisement -

pushpa 2 teaser

అయితే ఇప్పుడు ఆ ఫేమస్ షూ స్టెప్ కొరియోగ్రాఫర్ ఎవరనేది తెలుసుకునే పనిలో పడ్డారు జనాలు. పుష్ప 2 చిత్రానికి డాన్స్ మాస్టర్లుగా ప్రేమ్ రక్షిత్, శ్రేష్టి వర్మ, గణేష్, ఆచార్య, విజయ్ పోలాకి పనిచేస్తున్నారు. అయితే ఈ టైటిల్ పాటలోని షూ హుట్ స్టెప్ ను విజయ్ పోలాకి కంపోజ్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో తెలిపారు. పుష్ప ది రూల్ కోసం నా సిగ్నేచర్ హుక్ స్టెప్ చూడండంటూ విజయ్ తన ఇన్ స్టాలో రీల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ వీడియోకు రియాక్ట్ అవుతూ విజయ్ పోలాకి డ్యాన్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. తమ అభిమాన హీరోతో అదిరిపోయే స్టెప్ వేయించావని.. ఆల్ ది బెస్ట్ ఫర్ యూవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here