మెగాస్టార్ చిరు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశాక ఫుల్ జోష్ లో వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. తాను గతంలో నటించిన వాల్తేరు వీరయ్య భారీగానే కలెక్షన్లు రాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అదే జోష్ తో డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా తీస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా మహానటి కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. యువ హీరో సుశాంత్ ఓ కీలకపాత్ర పోషించారు. సినిమా ప్రమోషన్స్ నిమిత్తం కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో అన్నంటే ప్రాణం ఇచ్చే పాత్రలో నటించింది.
చాలామందికి తెలిసిన విషయమేమిటంటే కీర్తి సురేష్ తల్లి కూడా ఒకప్పటి హీరోయినే. తన పేరు మేనక. ఆమె ఆ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మేనక 1980లో వచ్చిన పున్నమినాగు చిత్రంలో చిరంజీవి సరసన ఆడి పాడింది. ఆమె కూతురే కీర్తి సురేశ్. ఈ విషయంపైనే కీర్తి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. చిరంజీవితో పున్నమినాగు సినిమాలో నటించిన సందర్భంలోని చాలా విషయాలు మేనక తనకు వివరించినట్లు తెలిపింది. అంతేకాకుండా చిరంజీవి ఎనర్జీ, డేడికేషన్, సెట్ లో ఉన్నప్పుడు ఇచ్చే సలహాలు, సూచనల గురించి కూడా వివరించనట్లు తెలిపింది. సినిమాకు పనిచేసే ఎవరినైనా కేరింగ్ గా చూసుకుంటారని.. అమ్మ చాలా చిన్న తనంలోనే సినిమాలకు రావడంతో చిన్న పిల్లకు చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పేవారట. ఆ విషయాలు చిరుకు చెబితే.. మీ అమ్మ చాలా అమాయకురాలు.. నువ్వు మాత్రం చాలా స్మార్ట్ అని చిరంజీవి అన్నట్టుగా కీర్తి సురేష్ తెలిపింది. ఒకే కుటుంబంలో తల్లి హీరోయిన్గా.. కూతురేమో చెల్లెలుగా నటించడం వీరికే దక్కిందని చెప్పొచ్చు.