ప్రపంచవ్యాప్తంగా రక్షా బంధన్ పండుగను ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వయసు కులమత బేధాలు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జనాలు రాఖీ పండుగను కనులపండువగా జరుపుకున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వదించి వారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. అయితే రాఖీ పండుగ అంటే చాలామందికి స్పెషల్.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ రాఖీ కడితే వాళ్ళ సిస్టర్ కు ఏమి ఇస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. అదేంటి ఆర్జీవీ మనలా మనిషి కాదా అని అనుకుంటున్నారా..? అవును మనలాంటి మనిషే అయినా ఆయన చాలా తేడా. ప్రస్తుతం ఇదే విషయంపై నెటిజన్లు ఆర్జీవీ పై కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు సెంటిమెంట్.. ఎమోషన్స్ అలాంటివి ఉండవు.
అయితే రామ్ గోపాల్ వర్మ తన సోదరి రాఖీ కడితే ఎలా ఫీల్ అవుతాడనే విషయం రీసెంట్గా బయటపడింది. ఆర్జీవీ సోదరి విజయలక్ష్మి రాఖీ పండుగ సందర్భంగా అనేక విషయాలను ఇటీవల పంచుకున్నారు. రాంగోపాల్ వర్మకి కూడా ఎమోషన్స్ ఉంటాయట. కానీ అవి అందరిలాగా కాదని తెలిపింది. తన పనులకు ఆటంకం కలిగించే సెంటిమెంట్స్ వర్మ ఫాలో అవ్వరట. రాఖీ అంటే వర్మకు ఎన్నో విచిత్రమైన అనుబంధాలు ఉన్నాయట
. రాఖీ కడతాను అంటే వర్మ తిడతారట.. అదే ఆయన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వెళ్లి చేతికి ఆయనకు తెలియకుండా రాఖీ కడితే చూసి థ్రిల్ అవుతారట. అదే కాసేపు ఫోన్ పక్కన పెట్టు రాఖీ కడతానంటే మాత్రం తిట్టేస్తారట.. తన పనికి ఎవరు ఆటంకం కలిగించిన ఒప్పుకోరని తన సోదరి విజయలక్ష్మి చెప్పారు. తనకు రాఖీ కట్టినప్పుడు నాకు గిఫ్ట్ ఇస్తారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయను. రాంగోపాల్ కు రాఖీ కట్టడమే నాకు పెద్ద గిఫ్ట్.. తను వేరే గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది .