Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. బద్రి సినిమాలో నటించిన తర్వాత వీరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా డివోర్స్ తీసుకుని ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. కాగా వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు రేణు దేశాయ్ తో పాటే పుణెలో ఉంటున్నారు. అయితే ఈ పిల్లలకు తండ్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. విడాకులు అనంతరం పుణె వెళ్లిపోయిన రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లల ఆలన పాలన చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది.

ఇదిలా ఉండగా గతంలో రేణు దేశాయ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో పిల్లలకి ఉండే బాడింగ్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ… ఆద్య చాలా కమాండింగ్ గా ఉంటుంది. వాళ్ల నాన్నకు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు కలుస్తావు. మమ్మల్ని చూడాలని లేదా… నువ్వు వెంటనే రావాలని గట్టిగా అడుగుతుంది. అకీరా అలా కాదు. ఆద్యతో నేను మరాఠీలో మాట్లాడతాను. తనతో మరాఠీలోనే మాట్లాడాలని ఆద్య కండిషన్ పెట్టింది. అకీరాతో మాత్రం తెలుగులో మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ల నాన్న భాష అకీరా మర్చిపోకూడదు కదా అందుకే.
అకీరా- పవన్ తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్లు లైఫ్, ఫిలాసఫీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. వాళ్ల మధ్య సినిమా ప్రస్తావన రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. నేను కూడా ఆయనతో మాట్లాడతాను. విడాకుల తర్వాత మేము మిత్రులుగా ఉంటున్నాం. ఆద్య వాళ్ల నాన్నతో మరాఠీలోనే మాట్లాడుతుంది. నా కోసం ఆయన భాష నేర్చుకోలేదు కానీ కూతురు కోసం మరాఠీ నేర్చుకున్నారు. ఆద్య పవన్ మరాఠీలో మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చింది రేణు. కాగా అకీరా టీనేజ్ దాటేసి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా వెండితెరకు పరిచయం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.