డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మందినాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ. అక్కడే పుట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్ ను తన కెరీర్ గా ఎంచుకుంది. అలా తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాప్సీ తండ్రి కూడా ఓ బిజినెస్ మ్యాన్. తండ్రి వ్యాపార వేత్త కావడంతో ఆమె హీరోయిన్ గా సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. తన తండ్రి బాటలోనే వ్యాపార రంగంలోకి వచ్చి సక్సెస్ కావాలని అనుకుందట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి నార్త్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి తాప్సీ సినిమాల్లోకి రాకముందు ఏం పని చేసేదో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

తాప్సీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకు వచ్చిన ఆఫర్లన్నీ సెకండ్ హీరోయిన్ రోల్సే. దాదాపు చాలా సినిమాలో తను సెకండ్ హీరోయిన్ గానే చేసింది. ఇలా చేస్తుండగానే తనకు తమిళంలో హీరోయిన్ గా ఆఫర్లు రావడంతో అక్కడే వరుసగా సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్లి దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చాలా వరకు తాప్సీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇక తాప్సీ సినిమాలలోకి రాకముందు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేదట. అయితే సినిమాల పైన తనకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో తన ఫ్రెండ్ నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చాడట. దీంతో ఆడిషన్ కి తన ఫోటోలను వెంటనే పంపమన్నారట. అలా ఒకవైపు జాబ్ చేస్తూనే మరొకవైపు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా సెటిల్ కావడంతో జాబ్ మానేసి ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయింది.
