Bigg Boss Ashwini : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోగ్రాం స్టార్ట్ అయి ఇప్పటికి 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా బయటకు రాబోతున్నారు. అయితే శనివారం ఎపిసోడ్‌లో భాగంగా అశ్వని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఈ వారం నామినేషన్‌లో భాగంగా ప్రియాంక, శోభాశెట్టి తదితరులు నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ నామినేషన్‌లో రతిక, అశ్విని డేంజర్ పొజిషన్‌లో ఉన్నారు.

దీంతో ఈ వారం వారిద్దరూ ఎలిమినేట్ అవుతారంటూ రకరకాల వార్తలు వచ్చాయి.. కానీ డబుల్ ఎలిమినేషన్ అంటే శనివారం ఒక కంటెస్టెంట్, ఆదివారం మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. నిన్నటి ఎపిసోడ్‌లో భాగంగా అశ్విని ఎలిమినేట్ అయింది. కానీ అశ్వని మాత్రం 7 వారాల పాటు ఇంట్లోనే ఉంటూ పలు పనుల్లో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. 7 వారాల పాటు తన నటనతో అందరినీ ఆకట్టుకున్న అశ్వని ఈ వారం చాలా సైలెంట్ గా ఉండిపోయింది.

సెల్ఫ్ నామినేషనే తనకు శాపంగా మారిపోయిందని బాధపడింది. నిజానికి చెప్పాలంటే తనను ఎవరూ పట్టించుకుంట లేరంటూ దాదాపు రెండు వారాల పాటు ఏడ్వడానికే సరిపోయింది. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆమె.. 7 వారాల పాటు హౌస్ లో ఉండడంతో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అశ్విని వారానికి రెండు లక్షల చొప్పున ఏడు వారాలకు 14 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.