Lavanya Tripathi : పెళ్లిలో లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీర కాస్ట్ ఎంతో తెలుసా?

- Advertisement -


Lavanya Tripathi : అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడింది. అనంతరం మెగా ఇంటికి కోడలిగా మారిపోయింది. ఇటు ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ కు దగ్గర సన్నిహితులు సుమారు 120 మంది హాజరైనట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Lavanya Tripathi
Lavanya Tripathi

వరుణ్ తేజ్ గోల్డ్ కలర్ షేర్వానీలో కనిపించగా.. లావణ్య త్రిపాఠి ఎరుపు రంగు కాచీవరం చీరలో అందంగా కనిపించింది. ఈ ఫోటోలు చూసిన తర్వాత లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర గురించి తెగ చర్చలు మొదలయ్యాయి. ఈ చీరను ఎవరు డిజైన్ చేశారు.. దాని కాస్ట్ ఎంతో తెలుసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు జనాలు. తాజాగా ఇందుకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చీరను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ చీరను డిజైన్ చేశారట.. లావణ్య లవ్ కు సింబల్ గా భావించే ఎరుపును మంచి మనసును సూచించే విధంగా గోల్డ్ మిక్స్ డ్ తో ఈ చీరను డిజైన్ చేసినట్లుగా సమాచారం. అయితే ఈ చీర కాస్ట్ దాదాపుగా రూ.7 నుంచి 10 లక్షల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఈ జంట నవంబర్ 4వ తేదీన ఇండియాకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 5వ తేదీన హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ పెట్టబోతున్నట్లు సమాచారం. దీనికి దాదాపు 1000మంది ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here