NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అటు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్త మెగాస్టార్‌గా మారాడు చిరంజీవి. ఇటు నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా క్రేజ్ దక్కించుకున్నాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత 20 సంవత్సరాల క్రితం చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన ఓ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు నైజం డిస్ట్రిబ్యూటర్ అయిన ఆవుల గిరి ప్రొడ్యూస్ చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. చాలామంది రచయితలను కూర్చోబెట్టి స్క్రిప్ట్ మీద పనిచేశారు. అయినా ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఓ కొలిక్కి రాలేదట. వాస్తవానికి, ఇక సినిమాను ఫుల్ మాస్ సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే కథ అనుకున్న విధంగా వర్కౌట్ కాకపోవడం, దాన్ని డీల్ చేసే డైరెక్టర్ కూడా దొరక్కపోవడంతో.. ఈ ప్రాజెక్టును ఆవుల గిరి పక్కన పెట్టేశారట. అయితే తర్వాత ఈయన ప్రొడ్యూసర్గా మారి కొన్ని సినిమాలుకు ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమాలో ఏది సక్సెస్ కాలేదు.

దీంతో ఇండస్ట్రీ నుంచి గిరి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి – ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఏదేమైనా ఆ కాంబినేషన్ వర్కౌట్ కాకపోయినా.. దర్శకధీరుడు రాజమౌళి చలవతో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్.. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలాగే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.