Samantha : చేతిలో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగ్ ధర తో ఒక ఇల్లు కట్టేయొచ్చు తెలుసా..! సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ఒర్మాక్స్ సంస్థ ప్రకారం సమంత ఇండియా లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అట. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా, వ్యక్తిత్వం తో కూడా ఆమె కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఆమె మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి తో పోరాడి ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే.
డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ఏడాది పాటు విరామం తీసుకోవడానికి సిద్ధపడ్డ సమంత, ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఖుషి చిత్రం తో మంచి హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సమంత రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు దేవతని తలపించాయి.
బ్లూ అవుట్ ఫిట్ లో ఆమె దేవతలాగా మెరిసిపోతూ ఉండడం చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. 36 ఏళ్ళ వయస్సు వచ్చినా కూడా చెక్కు చెదరని అందం తో, నేటి తరం కుర్ర హీరోయిన్స్ కూడా అసూయ పడేలా సమంత తన అందం తో కట్టిపారేస్తుంది. ఎల్లప్పుడూ వర్కౌట్స్ చేస్తూ ఫ్యాట్ బర్నింగ్ చెయ్యడం, అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవడం వల్లే సమంత ఇంత అందం గా ఉండడానికి కారణం అని అంటున్నారు అభిమానులు.
ఇదంతా పక్కన పెడితే సమంత ప్రస్తుతం ప్రముఖ హాలీవుడ్ మూవీ ‘ది మార్వెల్స్’ కి టాలీవుడ్ తరుపున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా రెండు రోజుల క్రితం ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా చూస్తుంటే సమంత హాలీవుడ్ లోకి కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుందా అని అంటున్నారు ఫ్యాన్స్.ఇకపోతే ఈ క్రింద కనిపిస్తున్న ఫోటో లో సమంత తో పాటుగా ఆమె చేతిలోని బ్యాగ్ కూడా ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ని ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుందట, దీని ధర పది లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ ధర తో ఒక మధ్యతరగతి కుటుంబం చిన్న ఇల్లు కట్టేసుకోవచ్చు.