Ramoji Rao : రామోజీ రావుకి ఆ పేరంటే నచ్చకపోయేదా.. ఆయన అసలు పేరు ఏంటో తెలుసా ?

- Advertisement -

Ramoji Rao : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బెడ్ కే పరిమితమయ్యారు. శనివారం ఉదయం 4గంటల 50నిమిషాలకు నానక్ రామ్ గూడ లోని స్టార్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం మూడుగంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. రాత్రికి ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటిలేటర్ మీదే ఉంచి చికిత్స అందిచారు. కానీ,రామోజీరావు తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తన పార్థివదేహాన్ని తరలించారు. ఇక ఈయన గొప్ప వ్యాపార వేత్త, అనేక సంస్థలను ప్రారంభించి, ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు.

రామోజీరావు గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయి. అందులో ఆయన పేరు ఒకటి. ప్రతి ఒక్కరి జీవితంలో చాలామంది తమ బిడ్డలకు వారి తల్లిదండ్రుల పేరు పెడుతారు. కానీ రామోజీరావు మాత్రం తన పేరు తానే పెట్టుకున్నారు. ఆ పేరుతో రికార్డులను సృష్టించారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే? ఆయన స్థాపించిన సంస్థలు, ఆయన వ్యాపారాలు, తాను ఎంతో మందికి ఉపాధిని ఇచ్చిన తీరు ఇవన్నీ ఆయన ఆలోచనల ఫలితమే అయితే రామోజీరావు తన పేరు ఎందుకు మార్చుకున్నారు. ఆయనకు వాళ్ల పేరెంట్స్ పెట్టిన అసలు పేరేంటో చూద్దాం.

- Advertisement -

కృష్ణా జిల్లా గుడివాడలో 1936లో నవంబర్ 16న ఓ రైతుకుటుంబంలో జన్మించారు. ఈయన తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందిన వారు, అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వెళ్లి వచ్చాడు. రామోజీరావు తన తాత రామయ్య మరణించిన 13 రోజులకు పుట్టారు. దీంతో కుటుంబ సభ్యులు తన తాత జ్ఞాపకార్థం రామోజీరావుకు రామయ్య అని నామకరణం చేశారు. కానీ ఈ పేరు అంటే రామోజీరావుకు అస్సలు నచ్చక పోయేదట. అందుకే తాను స్కూల్లో చేరేటప్పుడే సొంతంగా తన పేరును తానే మార్చుకుని, రామోజీరావు అని పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతం కొనసాగుతూ వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here