జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు సాధించిన వర్సటైల్ యాక్టర్ కీర్తి సురేష్. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఒకవైపు హీరోయిన్ గా పలు లేని ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ తన సత్తా ఏంటో చాటుతోంది కీర్తి సురేష్. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో పాటు నాని సరసన దసరా సినిమాలో కూడా నటించి పాన్ ఇండియా లెవల్లో మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి నటించింది. కీర్తి సురేశ్ తొలిసారిగా 2013లో మలయాళం చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేశ్. ప్రస్తుతం పలు చిత్రాలను కమిట్ అయి బిజీ షెడ్యూల్ మెయింటేన్ చేస్తుంది.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న స్టార్ హీరోయిన్లలో మొదటి వరుసలో ఉన్నారు కీర్తి సురేశ్. ఆమె ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు రూ.3.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో తీసుకుంటున్న కీర్తి మొదటి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. కీర్తి తన మొదటి సంపాదన రూ .500 రూపాయలే తీసుకుందట.

సినిమా బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కీర్తికి చిన్న వయసు నుంచి ఫ్యాషన్ నాటకాల పైన ఆసక్తి ఉంది. దీంతో బాల నటి గా రెండు మూడు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాలేజీలో చదువుతున్న సమయంలో ఒక షోలో పాల్గొని మొదటిసారి రూ.500 రెమ్యూనరేషన్ తీసుకుందట. 2013లో గీతాంజలి అనే ఒక హర్రర్ చిత్రంలో కీర్తి సురేష్ డబుల్ రోల్ పోషించింది. ఇలా సంపాదించిన డబ్బులను ఏదైనా మంచిపనికి ఇవ్వమని కీర్తి తన పేరెంట్స్ కు చెప్పిందట.