Naa Anveshana : యూట్యూబర్ గా ప్రపంచం లోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అన్వేష్. ఉత్తరాంధ్ర లోని భీమిలి ప్రాంతానికి చెందిన ఈ సాధారణ మధ్య తరగతి మనిషి సంపాదన నేడు స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానిది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రపంచ యాత్రికుడిగా 187 దేశాలను చుట్టొచ్చిన ధీరుడు ఆయన. ఇతను పెట్టే వీడియోస్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.

వివిధ దేశాలకు సంబంధించిన సంస్కృతి, నాగరికతని కళ్ళకు కట్టినట్టు చూపించి, వాటిని ఆయన వివరించే తీరుకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ కి చెందిన పెద్ద పెద్ద సెలెబ్రిటీలు కూడా ఈయన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నారు. రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇతనిని మిమిక్రీ చేస్తూ ట్విట్టర్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరం చూసాము.

ఇకపోతే ఈయన యూట్యూబ్ ద్వారా సంపాదించే నెల సంపాదన మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సంపాదించరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన పెట్టే వీడియోస్ నుండి దాదాపుగా నెలకి కోటి 50 లక్షల రూపాయలకు పైగానే డబ్బులు వస్తాయట. ఈ విషయాన్నీ అన్వేష్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు. ఒక స్టార్ హీరో ఒక సినిమాని పూర్తి చెయ్యడానికి ప్రస్తుతం ఏడాది నుండి రెండేళ్ల సమయం పడుతుంది.

ఇందుకోసం వారు తీసుకొనే పారితోషికం 25 కోట్ల రూపాయిల నుండి ప్రారంభం అవుతుంది. కానీ అన్వేష్ కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదిస్తున్నాడు. ఒక్కో నెల ఆయనకీ మూడు కోట్ల రూపాయిలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. అలా ఏడాదికి సగటున అన్వేష్ 20 కోట్ల రూపాయిల వరకు సంపాదిస్తాడని అంటున్నారు. ఇతను పెట్టే వీడియోస్ కి, పడే కష్టానికి ఆ మాత్రం రావడం తప్పే లేదు అని చెప్పొచ్చు.