Bigg Boss 8 Telugu : ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెన్నపవసరం లేదు. ప్రతీ ఒక్కరు వయస్సు తో సంబంధం లేకుండా ఈ షో ఎప్పుడు మొదలు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి అవ్వగా, 7 వ సీజన్ అన్ని సీజన్స్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని స్టార్ మా ఛానల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. అంత పెద్ద హిట్ అవ్వడంతో 8 వ సీజన్ పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ విషయం లో ఏమాత్రం వెనకడుగు వెయ్యట్లేదు స్టార్ మా యాజమాన్యం. లాస్ట్ సీజన్లో ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో సాగిన బిగ్ బాస్ షో, ఈసారి కూడా అదే తరహా విన్నూతనమైన కాన్సెప్ట్ తో మన ముందుకు రానుంది.
ఇకపోతే ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా లో పలు ప్రచారాలు జరిగాయి. ప్రముఖ యాంకర్స్, టీవీ ఆర్టిస్టులతో పాటు, యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ లో బాగా పాపులారిటీ ని సంపాదించిన సెలెబ్రిటీలు కూడా ఈ సీజన్ లో కనిపించబోతున్నారు. వారిలో సీమరాజ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సీమరాజ యూట్యూబ్ లో వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎంత పాపులారిటీ ని సంపాదించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయం లో సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ సీమరాజ. వైసీపీ పార్టీ పై వ్యంగ్యంగా ఆయన చేసే వీడియోలకు అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంటుంది.
అలా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సీమరాజకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. గత రెండు రోజుల క్రితమే బిగ్ బాస్ యాజమాన్యం ఆయన్ని సంప్రదించినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదే కనుక జరిగితే ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరకొచ్చు కానీ, స్టార్ మా ఛానల్ కి వైసీపీ పార్టీ కి సంబంధించిన వారు నెగటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి సీమరాజ బిగ్ బాస్ షో లో పాల్గొంటాడా లేదా అనేది మరి కొద్దిరోజుల్లో తెలియనుంది. ఈ బిగ్ బాస్ షో ఆగష్టు చివరి వారం లో కానీ, సెప్టెంబర్ మొదటి వారం లో కానీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.