NTR : గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే గూస్ బంప్స్ తెప్పించే కటౌట్ మాత్రమ ఎన్టీఆర్ దే అనడంతో ఏ మాత్రం సందేహం లేదు. నందమూరి నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్. నిన్ను చూడాలని ఉంది సినిమాలో నూనూగు మీసాలతో ఎంత సైలెంట్ గా కనిపించాడో.. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన RRR సినిమాలోనూ.. అంతే సైలెంట్ గా కనిపించాడు. కానీ ఒకటే తేడా ఒక్కొక్క సినిమాకి తనలోని నటనాస్థాయిలను పెంచుకుంటూ వెళ్తున్నారు.
ఒక సినిమా విషయంలో చేసిన తప్పును మరొక సినిమా విషయంలో చేయనే చేయడు ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ వార్ 2 ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దేవర సినిమాతో పాటుగా నడుస్తోంది. ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమా షూట్స్ పూర్తి కాగానే ఆగస్టులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతుంది సినిమా యూనిట్. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
కాగా ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. దాదాపు ఈ సినిమా కోసం రూ.130 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటివరకు రూ.70 నుంచి రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్న తారక్ దేవరతో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. అదే విధంగా వార్ 2 కోసం కూడా రూ.100 కోట్లు తీసుకుంటున్నారట .. అయితే ప్రశాంత్ నీల్ సినిమా కోసం మాత్రం ఏకంగా రూ.130 కోట్లు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారట. ఆయన కెరీర్లోనే ఇదే హయ్యస్ట్ రికార్డ్ రెమ్యూనరేషన్ కావడం గమనార్హం. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ దట్ ఈజ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.