Hyper Adhi : జబర్దస్త్ కమెడీయన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..నాన్ సింక్ పంచులతో జనాలను కడుపుబ్బా నవ్విస్తాడు.. ఆది లేకుండా ఏ ఈవెంట్ షో కూడా ఉండదు.. అంతలా ఫెమస్ అయ్యాడు ఆది.. కేవలం షోలలో మాత్రమే కాదు.. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. హైపర్ ఆది మొదట్లో అదిరే అభి టీం లో ఒక చిన్న కంటెస్టెంట్ గా వచ్చాడు ఒక రకం గా చెప్పాలంటే ఆదికి అభినే అవకాశం ఇచ్చాడు ఆ విషయం ఆది కూడా చాలా సార్లు చెప్పాడు..అభి వల్లే ఇలా ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు.. ఇప్పుడు అభిని మించేలా ఆస్తులు సంపాదించాడు.. ప్రస్తుతం ఆది దగ్గర ఎన్నికోట్ల ఆస్తి ఉంది, ఎటువంటి బిజినెస్ లు చేస్తున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.. దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

మొదట్లో హాస్టల్ ఫీజ్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే అదిరే అభినే ఆది కి మనీ ఆరేంజ్ చేసేవాడు కొద్దీ రోజూలకి ఆది టాలెంట్ ని గుర్తించిన జబర్దస్తు యాజమాన్యం రైజింగ్ రాజు ని ఆదిని కలుపుతూ రైజింగ్ రాజు అండ్ హైపర్ ఆది టీంగా చేస్తూ వీళ్ళని టీం లీడర్ ని చేసారు… వీళ్ళ టీం బాగా క్లిక్ అయింది దింతో ఆది క్రెజ్ విపరీతంగా పెరిగింది ఇక ఎక్కడ ఏ ఈవెంట్ లో చూస్తున్న హైపర్ ఆది నే కనిపిస్తున్నాడు… ప్రస్తుతం ఆది జబర్దస్తులోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ఇటీవల వచ్చిన జబర్దస్తు కంటెస్టెంట్స్ కార్లు కొంటుంటే ఆది మాత్రం ఫస్ట్ నుంచి కూడా కార్లు కొనకుండా స్టార్టింగ్ నుంచి కూడా వచ్చిన మనీ ని ల్యాండ్స్ పైనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు.కార్ లేకుండా మొన్నటి వరకు ఆది బైక్ మీదే తిరిగేవాడు..

అలా సంపాదించిన ఆది ఆస్తుల విలువ ఇప్పుడు చాలా వరకు పెరిగాయని చెప్పాలి ఆది కి హైదరాబాద్ లోనే రెండు అపార్ట్మెంట్స్ లో రెండు ఫ్లాట్స్, మణికొండ లో ఒక విల్లా హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లో చాలా వరకు ఓపెన్ ప్లాట్స్ అలాగే హైదరాబాద్ అవుట్ కట్స్ లో ల్యాండ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎంత లేదన్న ఇప్పుడు వాటి విలువ కొన్ని కోట్లల్లో ఉంటుంది అని కూడా తెలుస్తుంది…షో లోనే కాకుండా హైపర్ ఆది సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ కూడా చేసాడు.. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతూన్నాడు.. ఆది జీవితం యువనటులకు ఆదర్శం అనే చెప్పాలి.. ఏది ఏమైనా ఇంతగా ఆస్తులు సంపాదించడం మామూలు విషయం కాదని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..