Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అవసరం లేదు. సందీప్ కిషన్ తో కలసి వెంకటాద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ వివాహం కోసం రకుల్ ప్రీత్ సింగ్ గోవాలోని లగ్జరీ హోటల్ బుక్ చేసింది. తన పెళ్లికి సంబంధించిన అని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్లో రకుల్ జాకీల వివాహం మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ వివాహానికి అతి కొద్ది మంది బంధువులు – స్నేహితులు మాత్రమే హాజరవుతున్నారంటూ సమాచారం.

కాగా రకుల్ పెళ్లి చేసుకోబోతున్న గోవాలోని ఐటిసి గ్రాండ్ రిసార్ట్ హోటల్ తాలూకా వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హోటల్లో మొత్తం 246 గదులు ఉంటాయట. చుట్టూ చల్లటి కొబ్బరి చెట్ల వాతావరణం ఉంటుందట. మేక్ మై ట్రిప్ ప్రకారం ఈ హోటల్ లో ఒక్క గది ధర 19 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయల వరకు ఉంటుందట.

ఇందులో కొన్ని పన్నులు కూడా ఉన్నాయి. గోవాలోనే అత్యంత లగ్జరీ హోటల్ అయిన ఈ రిసార్ట్ లో రకుల్, జాకీల పెళ్లి జరగబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . ఫిబ్రవరి 19 నుంచి రకుల్ జాకీల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయట. పెళ్లి కోసం అమ్మడు కోట్లలోనే ఖర్చు పెడుతుందట. దీంతో సామాన్యుల అయితే ఏకంగా 100 పెళ్లి చేసుకునేయొచ్చు అంటూ జనాలు ఫన్నీగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..!!