Niharika మెగా ఫ్యామిలిలో మరో జంట విడాకులకు సిద్దమైన సంగతి తెలిసిందే..గత రెండు రోజుల నుంచి ఈ వార్తలు తెగ వినిపిస్తున్నాయి..మెగా బ్రదర్ నాగబాబు ముద్దులు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య విడిపోయారని.. త్వరలోనే వీరిద్దరూ అఫీషియల్‌గా విడాకులు తీసుకోనున్నారని జోరుగా ప్రాచారం జరుగుతోంది. మూడేళ్ల క్రితమే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.. అయితే ఈ మూడేళ్లు ఏం జరిగిందో కానీ విడిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి.. ఒక్కో వార్త తెరమీద వినిపిస్తుంది..పెళ్లికి ముందే ఎఫైర్లు ఉన్నాయని అందుకే చైతన్యతో ఉండలేక పోతుందని, చైతన్య నచ్చలేదని అందుకే విడాకుల వైపు అడుగులు వేస్తుందని తెలుస్తుంది..
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో నాగబాబు చాలా గ్రాండ్‌గా వీరి వివాహాన్ని జరిపించారు. పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు నిహారిక నటనకు పులిస్టాప్ పెట్టేసి.. నిర్మాతగా మారింది. అలాగే కెరీర్, ఫ్యామిలీ లైఫ్‌ను బాగానే బ్యాలెన్స్ చేసింది. అలాంటి నిహారిక, చైతన్య విడిపోయారు అనే వార్త అభిమానులకు మింగుడు పడడం లేదు..సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు..చైతన్య తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా తొలగించాడు. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. ఈ క్రమంలోనే నిహారికను సంబంధించిన అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్ నిహారికనే. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయినా.. కూడా కొన్ని సినిమా చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది..
ఇకపోతే తన తొలి సినిమా హీరో అయిన యంగ్ అండ్ టాలెంటెడ్ నాగశౌర్యతో నిహారిక లవ్ ఎఫైర్ నడిపించిందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇక తన బావ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, నిహారిక మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమన్నాయి.. అందులో నిజమేంటో మెగా ఫ్యామిలీ బయటకు రానివ్వలేదు.. కానీ తండ్రీ చూసిన పెళ్లి కొడుకును పెళ్లి చేసుకుంది నిహారిక.. ఇప్పుడు మనస్పర్థలు రావడంతో విడిపోతుందని టాక్.. మరి ఏది ఏమైనా నిజమేంటో వాళ్ళు చెప్పేవరకు ఆగాల్సిందే..