Guntur Kaaram : టాలీవుడ్ ఇంకా ప్రభాస్ ‘సలార్’ మేనియా నుండి బయటకి రాలేదు. కానీ ఇంతలోపే సంక్రాంతి సినిమాలు వచ్చేస్తున్నాయి. రాబొయ్యే సంక్రాంతి సినిమాలలో అందరి చూపు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం మీదనే. ‘అతడు’ మరియు ‘ఖలేజా’ లాంటి క్లాసిక్స్ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. అందుకే ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి నాలుగు లక్షల డాలర్లు వచ్చినట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. నార్త్ అమెరికా లో ఈ సినిమాకి ఏకంగా 5000 కి ప్రీమియర్ షోస్ షోస్ వేస్తున్నారు. అంటే సలార్ చిత్రం కంటే రెండు రెట్లు ఎక్కువ షోస్ అన్నమాట. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి కేవలం ప్రీమియర్ షోస్ నుండే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి.

ఓవర్సీస్ లో మహేష్ మరియు త్రివిక్రమ్ ఇద్దరు కూడా కింగ్స్ కాబట్టి రెండు మిలియన్ డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి రావడం అనేది నల్లేరు మీద నడకే అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 137 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అందులో కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ సినిమాకి 42 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అలాగే సీడెడ్ లో 14 కోట్లు ఉత్తరాంధ్ర లో 14 కోట్ల 20 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఆరు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టాలి. ఇది ఇలా ఉండగా ఉభయ గోదావరి జిల్లాలు రెండు కలిపి ఈ చిత్రానికి 16 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నెల్లూరు జిల్లాలో నాలుగు కోట్లు, కృష్ణ జిల్లాలో 6 కోట్ల 50 లక్షలు, గుంటూరు జిల్లాలో 8 కోట్లు, అలా మొత్తం మీద ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 105 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 137 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు సమాచారం.
