Chandra Mohan : మన టాలీవుడ్ స్వర్ణ యుగం లో ఉన్న హీరోలు, ఆర్టిస్టులు అందరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం.కొంతమంది మిగిలారు,వారిలో చంద్రమోహన్ ఒకడు అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన కూడా నిన్న స్వర్గస్తులు అయ్యాడు. ఈ విషయం తెలుసుకొని యావత్తు సినీ లోకం శోకసంద్రం లో మునిగిపోయాడు. హీరో గా మరియు క్యారక్టర్ గా కలిపి సుమారుగా 900 సినిమాలకు పైగా నటించాడు.
ముఖ్యంగా నేటి తరం కి ఆయన తండ్రి పాత్రల ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. తండ్రి పాత్ర అంటే మనకి ఈయనే గుర్తుకు వచ్చేవాడు. కానీ 2017 వ సంవత్సరం నుండి ఆయన సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నాడు. జీవితానికి సరిపడ డబ్బులు సంపాదించిన చంద్రమోహన్ ఇక చాలు ఇది జీవితానికి అనుకోని సినిమాల నుండి తప్పుకున్నాడు. అయితే ఆయనకీ సంబంధించిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
విషయం లోకి వెళ్తే శోభన్ బాబు తో స్నేహం చెయ్యడం వల్ల, ఆయన సలహాలు తీసుకోవడం వల్ల ఇండస్ట్రీ లో ఉన్నత స్థాయిలో ఆస్తులను ఏర్పర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిలో చంద్రమోహన్ కూడా ఒకడు. ఈయన బాగా సంపాదిస్తున్న రోజుల్లోనే డబ్బులను పోగు చెయ్యడం, ఆస్తులు ఏర్పరచుకోవడం వంటివి చేసాడు. అలా హైదరాబాద్ లో ఈయన ఎన్నో భూములను కొనుగోలు చేసాడట. ఆ భూముల్లో ఇళ్లను కూడా నిర్మించాడు.
సినిమాల్లో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చంద్రమోహన్ కి తన సొంత ఇళ్ల నుండి అద్దె గా నెలకు 10 లక్షల రూపాయలకి పైగా వచ్చేవి అట. దీనిని బట్టీ ఆయనకీ హైదరాబాద్ లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే అప్పట్లో శంషాబాద్ లో ఈయన 8 ఎకరాలు భూమిని కొనుగోలు చేసాడట. అప్పట్లో కబ్జాలు ఎక్కువగా జరిగేవట, తన భూమి కూడా కబ్జా అయిపోతుంది అనే భయం తో అమ్మేసాడట. ఇప్పుడు ఆ భూముల విలువ వంద కోట్ల రూపాయిలు పైగానే ఉంటుందని చంద్రమోహన్ గతం లో చెప్పుకొచ్చాడు.