Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు యూత్ హీరోస్ కి పోటీగా నిలుస్తూనే ఉంటాడు. ఆయనలో ఉన్న అద్భుతమైన లక్షణం ఏమిటంటే ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకొని వాళ్ళను ఎంటర్టైన్ చెయ్యడమే. నాలుగు జనరేషన్ ఆడియన్స్ ని ఆయన ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయనకీ 68 ఏళ్ళు వచ్చాయి.
ఈ వయస్సులో కూడా ఆయన ప్రస్తుత జెనెరేషన్ హీరోలతో పోటీ పడి చెయ్యాలి అనే తపన ని చూస్తుంటే, ఆయన కెరీర్ ప్రారంభం లో ఎంత ఉత్సాహం తో కష్టపడేవాడో, ఇప్పటికీ కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నాడు అని అనిపిస్తుంది. రీసెంట్ గా ఆయన తన ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా జిమ్ లో ఆయన చేస్తున్న వర్కౌట్స్ ని అప్లోడ్ చేసాడు. ఈ వర్కౌట్స్ చూసిన ప్రతీ ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ వయస్సులో ఈ రేంజ్ డెడికేషన్ ఎలా సాధ్యం అంటూ ఫ్యాన్స్ మరియు నెటిజెన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తారు.
మీ అందరికీ తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి రోజుకి నాలుగు నుండి 5 గంటలపాటు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటాడట. షూటింగ్స్ లేని సమయం లో అయితే ఆరు గంటలు జిమ్ లోనే గడిపిన రోజులు కూడా ఉన్నాయట. అందుకే ఆయన లుక్స్ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తున్నాయి అంటుంటారు ఫిట్నెస్ ట్రైనర్లు సైతం.
యంగ్ హీరోలు కూడా ఇన్ని గంటలు జిమ్ లో వర్కౌట్స్ చేస్తారా అంటే డౌటే. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి రీసెంట్ గానే అడుగుపెట్టిన ఆయన, షూటింగ్ కి వెళ్లే ముందు తన బాడీ ని ఫిట్ చేసుకొని వెళ్ళాడు. ‘బింభిసార’ డైరెక్టర్ వసిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.