Kalki : కల్కి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఇవే.. అంచనా వేస్తున్న ట్రేడ్ వర్గాలు

- Advertisement -

Kalki : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కల్కి సినిమా పేరు మార్మోగిపోతుంది. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూసేయాలా అని జనాలు ఆత్రుతగా ఎదురు చేస్తు్నారు. అటు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి. మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కెరీర్ ను ఓ రేంజ్ లో మలుపు తిప్పబోతున్న సినిమా ఇదే అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనే. దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు సినిమాలో ఉండడంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సినిమా విడుదలై ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

Kalki2898AD
Kalki2898AD

ప్రభాస్ బాహుబలి సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో.. అంతకు మూడు నాలుగు రెట్లు ఈ సినిమా హిట్ అవ్వడానికి కష్టపడుతుంది కల్కి టీం. కేవలం కంటెంట్ ని నమ్ముకుని ముందుకు వెళ్తున్న కల్కి టీం.. సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో కల్కి సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. కల్కి సినిమా మొదటిరోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎవరి అంచనాలు వాళ్లు వేస్తున్నారు. కాగా కల్కి సినిమా దాదాపు 90 కోట్లకు పైగానే మొదటి రోజు కలెక్షన్స్ సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన బిజినెస్ ప్రకారం బుక్ అయిన టికెట్స్ ప్రకారం రూ.90 కోట్లు కాదు ఏకంగా మొదటి రోజు రూ.100 కోట్లు కలెక్షన్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు అభిమానులు.

Prabhas
Prabhas

అదే నిజంగా జరిగితే మాత్రం సినీ చరిత్రలో ఇది ఒక పెద్ద చరిత్రగా చెప్పుకొవచ్చు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇలాంటి క్రేజీ రికార్డు కలెక్షన్స్ సాధించ లేదు. చూడాలి మరి ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్న విధంగా కలిగి సినిమా మొదటిరోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో..? మొత్తానికి ప్రభాస్ ఏదో మాయ చేసేలానే ఉన్నాడు..చరిత్ర సృష్టించేలాగా ఉన్నాడు అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here