Alia Bhatt ధరించిన ఈ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా..? దీని ధరతో ఒక్క ఇల్లు కట్టేయొచ్చు!

- Advertisement -

Alia Bhatt : ఇటీవల అయోధ్య లో జరిగిన రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన వారిలో బాలీవుడ్ నుండి రణబీర్ కపూర్ , అలియా భట్ జంట కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంత మంది విశిష్ట అతిథుల్లో ఈ క్యూట్ జంట బాగా హైలైట్ అయ్యింది. ముఖ్యంగా అలియా భట్ అయితే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునేలా చేసింది. ఈ ప్రారంభోత్సవ వేడుక కోసం ఆమె ప్రత్యేకంగా ఒక చీర ని తయారు చేయించుకుంది.

Alia Bhatt
Alia Bhatt

ఆ చీర ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చీర ని ఆమె ప్రత్యేకంగా తయారు చేయించుకుంది. రామాయణం లోని ముఖ్యమైన ఘట్టాల పెయింట్ తో ఈ చీరని తయారు చేసారు. నీలి రంగులో కనిపిస్తున్న ఈ చీర ని తయారు చేయించడానికి సుమారుగా 12 లక్షల రూపాయిలు ఖర్చు అయ్యిందట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

Alia Bhatt  Updates

సాధారణంగా సోషల్ మీడియా ని అనుసరించే అభిమానులు, తమ అభిమాన హీరో/ హీరోయిన్ ధరించే దుస్తులను కొనేందుకు అమితాసక్తిని చూపిస్తారు. అలా అలియా భట్ ధరించిన ఈ చీర ని చూసి అంతే ఆకర్షితులైన నెటిజెన్స్ గూగుల్ లో వెతుకుతూ ఈ చీర ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చెయ్యడానికి చూసారు. కానీ ఎక్కడా దొరకలేదు, ఆ తర్వాత ఆరా తీస్తే అది అలియా భట్ తన కోసం ప్రత్యేకంగా చేయించుకున్న చీర అని, దాని విలువ 12 లక్షల రూపాయలని తెలిసింది.

- Advertisement -
Alia Bhatt  News

12 లక్షలు పెట్టి మన లాంటి సామాన్యమైన వాళ్ళు ఇలాంటి వస్తువులు కొనగలరా చెప్పండి. అంత డబ్బులు ఉంటే ఇల్లు కట్టుకోవడమో, కారుని కొనుగోలు చెయ్యడమో చేస్తూ ఉంటాం. ఇదంతా పక్కన పెడితే రణబీర్ కపూర్ తో పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ అతనితో కలిసి ఎలాంటి సినిమాలో నటించని అలియా భట్, రీసెంట్ గా రణబీర్ కపూర్ -, సంజయ్ లీల భన్సాలీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here