Raj Tarun – Lavanya : మీడియాలో గత కొంతకాలంగా రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి మనమంతా చూస్తూనే ఉన్నాం. మధ్యలో కొన్ని సంఘటనల కారణంగా ఈ టాపిక్ వేడి కాస్త తగ్గింది కానీ, లావణ్య మాత్రం ప్రతీ రోజు ఈ సమస్య ని పెంచేందుకు మీడియా ముందు రోజుకో కొత్త కథతో రచ్చ చేస్తుంది. రాజ్ తరుణ్ ఈమె గోల తట్టుకోలేక మీడియా కి ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోయాడు. అయితే జరిగిన ఈ సంఘటన మొత్తం చూసిన నెటిజెన్స్ తప్పు లావణ్యదే, కేవలం రాజ్ తరుణ్ నుండి డబ్బులు గుంజుకోవడానికి, అతని ఇల్లుని కొట్టేయడం కోసం మాత్రమే నాటకాలు ఆడుతుంది అని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే రాజ్ తరుణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ ఈ నెల 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాజ్ తరుణ్ హాజరు కాలేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా రాజ్ తరుణ్ కి సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే రాజ్ తరుణ్ – లావణ్య కి మూడేళ్ళ పాప కూడా ఉందని, త్వరలో లావణ్య వాడబోయే అస్త్రం ఇదేనని అంటున్నారు.
దీని పై ఇండస్ట్రీ కి చెందిన ఒక సీనియర్ విలేఖరి మాట్లాడుతూ ఇదంతా కేవలం లావణ్య నాటకాలు అని, ఈమె మస్తాన్ బాషా అనే వ్యక్తితో ప్రేమాయణం నడపొచ్చు కానీ, రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా తో ఉండకూడదా?, ఇదెక్కడి న్యాయం?, మాల్వీ తో రాజ్ తరుణ్ ఉండడాన్ని లావణ్య జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఇలా చేస్తుంది అంటూ ఆయన ఈ సందర్భంగా మండిపడ్డాడు. ఇకపోతే లావణ్య తరుపున జనసేన పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత హై కోర్టు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర వాదిస్తున్నాడు. రాజ్ తరుణ్ తప్పించుకొని తిరుగుతున్నాడని, ప్రస్తుతం ఆయన మాల్వీ మల్హోత్రా తోనే ఉంటున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు.