Disha patani : బాలీవుడ్ బ్యూటీ ‘దిశా పటానీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలోనే అమ్మడు ఎక్కువ రచ్చ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్ గా ఉంటుంది దిశ. ఎప్పటి కప్పుడు హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తరచూ బికినీల్లో కనిపిస్తూ మతి పోగొడుతుంది. ఎంతలా అంటే.. బికినీ వేయడంలో ఈ అమ్మడి తర్వాతే ఎవరైనా అనుకునేంతలా. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట హీటు పెంచాయి.
దిశా పటానీ ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే డిజాస్టర్ ఎదుర్కొంది. ఆ సినిమాలో జియా జలే పాటలో ఆందాలు ఆరబోసి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఎంఎస్ ధోని’ చిత్రంతో కూడా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది దిశా.. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ తెలుగులో ‘కల్కి 2898AD’, తమిళంలో ‘కంగువ’ వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పొట్టి పొట్టి బట్టలు ధరించి తన అందాలతో కుర్రాళ్లకు మాస్ ట్రీట్ ఇస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటాని పెట్టిన ఫొటోలకు షేక్ అవుతున్నారు యువత. బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించిన దిశా ఎద, థైస్ అందాలను చూపిస్తూ సమ్మర్లో మరింత హీట్ పెంచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు.. ‘ఆ డ్రెస్ కొంచెం కిందకి జారితే మేము ఏం అయిపోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.