ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన వేదలమ్ చిత్రానికి రీమేక్ . రీమేక్ అయ్యినప్పటికీ కూడా మెగా స్టార్ మార్కు హీరోయిజం డాన్స్, స్టైల్ ఇలా ఏది మిస్ అవ్వకాకుండా ఒక అద్భుతమైన కమర్షియల్ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమా ఔట్పుట్ పై మూవీ టీం చాలా బలమైన నమ్మకం తో ఉంది. కచ్చితంగా ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో మరో వంద కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో నాలుగు 100 కోట్ల రూపాయిల షేర్ సినిమాలు ఉన్న ఏకైక హీరోగా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో అభిమానుల సమక్షం లో ఎంత ఘనంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు అభిమానులు చిరకాలం గుర్తించుకునేలా ఉన్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ గణనీయంగా పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు, బుకింగ్స్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లో అసలు ఏమాత్రం కూడా లేవు.
ఇప్పటి వరకు ఈ చిత్రం హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా అన్నీ థియేటర్స్ లో ప్రారంభం అయ్యాయి. అన్నీ థియేటర్స్ కి కలిపి బ్లాక్ చేసిన సీట్స్ ని తీసేస్తే కనీసం ఇప్పటి వరకు కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. అన్నిట్లోకీ ఓవర్సీస్ ప్రాంతం లో పర్వాలేదు అనే రేంజ్ బుకింగ్స్ జరిగాయి. అది కూడా పక్కా ప్లానింగ్ తో చేసారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండేది కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.