Jhanvi Khapoor : ఆమె ఓ ఐటమ్ గర్ల్ అంటూ జాన్వీ పరువు తీసేసిన డైరెక్టర్

- Advertisement -


Jhanvi Khapoor : దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ జాన్వి కపూర్ తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మత్తెక్కించే కళ్ళతో కుర్రకారు మనసులను కొల్లగొట్టేస్తోంది. సినిమాలపరంగా ఇప్పటివరకు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోయినా.. అందాల ఆరబోత.. ఫోటోషూట్స్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన సోషల్ మీడియాలో ఏ ఫోటో షేర్ చేసిన మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తుంటాయి.

ఇక తాజాగా జాన్వి కపూర్ కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ డైరెక్టర్ జాన్వి పై గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు విషయం ఏంటంటే జాన్వి.. టాలీవుడ్ ఎంట్రీ కోసం.. ఓ స్టార్ డైరెక్టర్ ను కలిశాడట నిర్మాత జాన్వీ తండ్రి బోనీకపూర్. స్టార్ డైరెక్టర్ కు జాన్వి ఫోటోను చూపించి అవకాశం ఇవ్వాలని కోరగా సదరు డైరెక్టర్ ఈమె హీరోయిన్ కాదు.. ఐటెం గర్ల్ అవుతుందంటూ అన్నాడట. దీంతో షాక్ అయినా బోనీకపూర్ డైరెక్టర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోయాడట.

ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్.. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తోనే తన మొదటి తెలుగు సినిమా అవకాశాన్ని కొట్టేసింది. తల్లి శ్రీదేవి లుక్స్ తో ఆకట్టుకునే జాన్వి.. కొరటాల డైరెక్షన్లో దేవర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోనీకపూర్.. జాన్వి.. తన తల్లి శ్రీదేవి ప్రతిరూపమని.. తన తల్లి నటనతో సమానంగా నటించగలదని.. ఆ డైరెక్టర్ పై పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు నెట్టింట్లో వార్త వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here