Upendra : విలక్షణమైన నటనతో కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ కమ్ హీరో ఉపేంద్ర. ఇప్పుడున్న స్టార్ హీరోహీరోయిన్లు కూడా ఆయన చిత్రాలకు వీరాభిమానులు. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉపేంద్రకు పెద్ద అభిమాని అంతే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వం అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కూడా. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భిన్నంగా ఆలోచించే దర్శకుడు ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది ఆయనే.

నటనలోనూ, దర్శకత్వంలోనూ స్టార్‌గా ఎదిగిన ఇండస్ట్రీకి చెందిన అరుదైన వ్యక్తుల్లో ఉపేంద్ర ఒకరు. ప్రస్తుతం ఆయన టాప్ డైరెక్టర్ అయినా.. తన సినీ ప్రయాణం ఏం పూలబాట కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చిన ఉపేంద్రకు కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదురయ్యాయి. గతంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపేంద్ర.. తొలి నాళ్లలో తనకు ఎదురైన అవమానాలను మరో సారి గుర్తుచేసుకున్నారు. ప్లేట్ పట్టుకుని భోజనం కోసం నిలబడితే ప్రొడక్షన్ వాళ్లు ఆవమానించాడని అన్నారు.
ప్రస్తుతం ‘యూఐ : ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపేంద్ర తన లైఫ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘పేద కుటుంబంలో జన్మించిన నాకు బాల్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకు అందరిలాగానే అవమానాలు ఎదురయ్యాయి. కెరీర్ తొలినాళ్లలో నేను ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ సమయంలో ప్లేట్ తీసుకుని భోజనానికి వెళ్లగా ప్రొడక్షన్‌కు చెందిన వ్యక్తి నాకు ఆహారం పెట్టలేదు. అక్కడ దారుణమైన అవమానం ఎదుర్కొన్నాను. దానికి కారణం నాకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం వల్ల. తర్వాత రోజుల్లో నేను హీరోగా మారిన తర్వాత నన్ను అవమానించిన ఆ వ్యక్తి ప్లేట్‌లో భోజనం వడ్డించి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అలా జీరోతో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది’ అంటూ తెలిపాడు హీరో ఉపేంద్ర.