టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు ‘తేజ’.ఈయన సినిమాల్లో ‘జయం’, ‘నువ్వు నేను’ మరియు ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలు మినహా సక్సెస్ సాధించినవి ఏమి లేదు. కానీ తేజ అంటే ఒక బ్రాండ్ ఇమేజి మాత్రం అలా ఉండిపోయింది. అయితే కెరీర్ లో అతి తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఈయన అప్పుడప్పుడు చేసే కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారుతుంటాయి.

తన మనసుకి అనిపించింది అనిపించినట్టు మాట్లాడేస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలను అసలు పట్టించుకోడు, రామ్ గోపాల్ వర్మ కి అప్ గ్రేడ్ వర్షన్ లాగ అనిపిస్తాడు తేజ. అయితే రీసెంట్ గా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆస్కార్ అవార్డుని తెచ్చి పెట్టి మన ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింప చేసిన రాజమౌళి గురించి సంచలన కామెంట్స్ చేసాడు.

ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ లో ఇప్పుడు సక్సెస్ సాధిస్తున్న రాజమౌళి , సుకుమార్ , వీవీ వినాయక్ లాంటి దర్శకులు ఏమి ఇంటెలిజెంట్ డైరెక్టర్స్ కాదు, కేవలం సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ మాత్రమే. ఇప్పుడు నేను కూడా ఇంటెలిజెంట్ డైరెక్టర్ కాదు , ఎందుకంటే నాకు సక్సెస్ లు పెద్దగా లేవు కదా అంటూ కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం ఆయన దగ్గుపాటి రానా తమ్ముడు దగ్గుపాటి అభిరాం తో ‘అహింస’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది.

దీనితో ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం ఆయన పలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూస్ లో ఒక యాంకర్ మీ ‘అహింస’ చిత్రం గతం లో మీరు తెరకెక్కించిన జయం సినిమా లాగానే అనిపిస్తుంది అని అడగగా నేను తీసాను కాబట్టే మీకు అలా అనిపిస్తుంది, డైరెక్టర్స్ మొత్తం అంత తెలివైన వాళ్ళేమి కాదు అంటూ పైన చెప్పిన కామెంట్స్ ని కొనసాగించాడు. తేజ చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతుంది.