Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో ఫ్యాన్స్ కి విపరీతంగా ఎదురు చూస్తున్న చిత్రం ఏమిటంటే, ఎవ్వరైనా ఓజీ పేరు చెప్తారు. కానీ ఆ సినిమా కంటే కూడా మార్కెట్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని తెలుగు ఆడియన్స్ చూడని కోణం లో డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం లో చూపించాడు. సుమారుగా 150 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో 2020 వ సంవత్సరం లో నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని ప్రారంభించాడు.

మధ్యలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురు అవుతూ ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా బిజీ అవ్వడం తో మరింత ఆలస్యం అయ్యింది. ఎన్నికలు పూర్తి అయ్యాక పవన్ కళ్యాణ్ మిగిలిన షూటింగ్ పార్ట్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడు.

అయితే చాలా గ్యాప్ రావడం తో ఈ సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియా లో ఒక అసత్య వార్త జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ప్రారంభం అయ్యింది అంటూ సోషల్ మీడియా ద్వారా మూవీ టీం నిన్న ఒక అధికారిక ప్రకటన చెయ్యడం తో ఇన్ని రోజులు సోషల్ మీడియా లో ప్రచారమైన రూమర్స్ కి చెక్ పడింది. అయితే ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు అంటూ వస్తున్న వార్తల గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
దానికి కారణం క్రిష్ అతి త్వరలోనే అనుష్క తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చెయ్యబోతుండడమే. క్రిష్ తప్పుకోవడం తో ఈ సినిమా మిగిలిన భాగానికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తాడని ఇండస్ట్రీ లో ఒక రూమర్ ప్రచారం అవుతుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని, మిగిలిన భాగానికి దర్శకత్వం క్రిష్ వహించకపోతే పవన్ కల్యాణే డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.
