Kalki 2898AD : ఏంటి నాగ అశ్విన్ ఇన్ని సినిమాల్లో నటించాడా.. లిస్టు పెద్దదే ?

- Advertisement -

Kalki 2898AD : పాన్ ఇండియ‌న్ స్టార్ట్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898AD బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. తమ జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు. మరో కొత్త లోకం పరిచయం చేశారని ఆశ్చర్యపోతున్నారు. అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంటూ కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డులు సృష్టించేందుకు రెడీగా ఉంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పేరు మార్మోగి పోతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్‌ కు పరిచయమైన నాగ్ అశ్విన్ ఈ సినిమా తర్వాత.. మహానటి, కల్కి సినిమాలను తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకున్నాడు. అయితే దర్శకుడిగా మారకముందు నాగ్ అశ్విన్‌.. ఎంతోమంది స్టార్ డైరెక్టర్‌ల‌ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయ‌న పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.

- Advertisement -

దర్శకుడిగా మారకముందు మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా..? సినిమాతో పాటు.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ లీడర్ ‘, ‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ‘ సినిమాల్లోనూ చిన్న పాత్రల్లో అలా కనిపించి పోయాడు నాగ్ అశ్విన్. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తరువాత మెగా ఫోన్ చేతబట్టాడు. ఇక తన మొదటి మూడు సినిమాలతోనే టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్టులో నాగ్ అశ్విన్‌ పేరు ముందు వరుసలో నిలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here