ప్రస్తుతం టాలీవుడ్ లో కేవలం రెండు చిత్రాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఒకటి రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ అయితే మరొకటి చిరంజీవి నటించిన భోళాశంకర్. వయసుకు తగ్గ క్యారెక్టర్ చేస్తూ కూడా హీరో ఎలా ఉండాలి అనేదానికి లైవ్ ఎగ్జాంపుల్ గా రజినీకాంత్ జైలర్ చిత్రం నిలుస్తుంటే.. భోళాశంకర్ చిత్రం మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ డైరెక్టర్ మెహర్ రమేష్ ను సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన భోళాశంకర్ బోల్తాపడడంతో.. మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ కు సంబంధించిన ఎన్నో విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది .అందులో ఒకటి మెహర్ రమేష్ నటించిన మూవీ గురించి.చిరంజీవికి వరుసకు కజిన్ అయ్యే మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో యాక్టింగ్ లో కూడా తన ప్రతిభ చూపించడానికి ప్రయత్నించాడు. మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అయిన బాబీ చిత్రంలో మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ లో మెహర్ రమేష్ నటించాడు.
ఈ మూవీ 2002న రిలీజ్ అయింది.. అంటే మెహర్ రమేష్ డైరెక్టర్ కాకముందు ఈ మూవీ తో ఆర్టిస్ట్ అవ్వడానికి ప్రయత్నించాడు.అలా మొదటి సినిమాతో పెద్ద డిజాస్టర్ ని సృష్టించిన మెహర్ రమేష్ యాక్టింగ్ సెట్ కాదు అని ఫిక్స్ అయ్యాడేమో ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసారు. ఆ సమయంలోనే పూరి ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా సినిమా చేయాల్సి వచ్చింది. అప్పుడే కన్నడలో పునీత్ తో మూవీ రావడంతో …ఆ సినిమాను మెహర్ రమేష్ కు అప్పగించారు.
వీర కన్నడిగ అనే పేరుతో కన్నడలో వచ్చిన ఆ చిత్రం మంచి హిట్ కావడంతో మెహర్ రమేష్ తన ప్రతిభను టాలీవుడ్ లో ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు.క్రాంతి ,శక్తి, షాడో ఇలా వరుస డిజాస్టర్ ల తర్వాత పదేళ్ల గ్యాప్ తీసుకొని చిరంజీవితో ఏకంగా భోళాశంకర్ చేశాడు. మరి దాని రిసల్ట్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. మెహర్ రమేష్ కేవలం డైరెక్షన్లోనే కాదు యాక్టింగ్ లో కూడా పెద్ద డిజాస్టర్ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.