Director Harish Shankar : జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన డైరెక్టర్ హరీష్ శంకర్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!

- Advertisement -

Director Harish Shankar :  కమర్షియల్ డైరెక్టర్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న దర్శకులలో ఒకరు హరీష్ శంకర్. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన మరో టాలెంటెడ్ డైరెక్టర్. రవితేజ హీరో గా నటించిన షాక్ అనీ చిత్రం ద్వారా ఈయన ఇండస్ట్రీ కి వచ్చాడు. మొదటి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా రవితేజ మళ్ళీ పిలిచి ‘మిరపకాయ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని ఎలా బద్దలు కొట్టిందో మన కళ్లారా చూసాము.

Harish Shuts The Tamil Critic With His Sarcastic Tweet! | Harish Shuts The Tamil Critic With His Sarcastic Tweet!

ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆ తర్వాత చేసిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’,’దువ్వాడ జగన్నాథం’, ‘గడ్డలకొండ గణేష్’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అలా మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. హరీష్ శంకర్ కి హీరోయిన్ మీద ఉన్న శ్రద్ద స్క్రిప్ట్ మీద లేకుండా పోయిందని, ఈ సినిమాని కాపాడితే హీరోయిన్ మాత్రమే కాపాడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. దీనిని హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేసుకునే గ్రూప్ లో షేర్ చేసాడు. నెగటివ్ కామెంట్స్ చేసినవారికి కౌంటర్ ఇవ్వమని ఆదేశించాడు. ఆ గ్రూప్ లో ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ ఎన్నో పోస్ట్స్ ఉన్నాయి.

- Advertisement -

Harish Shankar slams Rumors

నీకు సినిమా అవకాశం ఇచ్చిన హీరో మీద ట్రోల్ల్స్ వేసే గ్రూప్ లో ఉంటావా?, సిగ్గు అనిపించడం లేదా అంటూ ఎన్టీఆర్ అభిమానులు హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి బండ బూతులు తిట్టారు. అంతే కాదు హరీష్ శంకర్ కి ‘కాట్రవల్లీ’ అనే మరో ట్విట్టర్ అకౌంట్ ఉందనీ, ఈ అకౌంట్ నుండి ఆయన ఎక్కువగా ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటాడని, టాలీవుడ్ లో అనేక టాప్ హీరోలను బూతులు తిడుతూ పోస్టులు కూడా పెట్టారని, సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ మొత్తం ఇప్పుడు హరీష్ శంకర్ ని రఫ్ఫాడిస్తున్నారు. మరి దీనికి ఆయన ఏమని సమాధానం ఇస్తాడో చూడాలి.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here