H Vinoth : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే నటులలో ఒకరు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. నాలుగు తరాల ఆడియన్స్ ని అలరిస్తూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకొని నేటికీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నాడు ఆయన. అలాంటి స్టార్ తో పని చెయ్యడం ఏ డైరెక్టర్ కి అయినా ఒక అదృష్టం లాంటిది. రాజమౌళి, శంకర్ లాంటి డైరెక్టర్స్ కూడా కమల్ హాసన్ తో సినిమాలు చెయ్యాలని పరితపిస్తూ ఉంటారు.

కానీ ఒక తమిళ స్టార్ డైరెక్టర్ మాత్రం కమల్ హాసన్ తో సినిమా చేసే బదులు కమెడియన్ తో సినిమా చెయ్యడం బెటర్ అని అనుకుంటున్నాడు. ఇతని కెరీర్ లో ఒకే ఒక్క సినిమా మినహా, మిగిలినవన్నీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. అయినా కూడా ఇంత పొగరు అవసరమా అని అంటున్నారు నెటిజెన్స్.

కానీ పూర్తి వివరాల్లోకి వెళ్తే అతను కమల్ హాసన్ తో సినిమా చెయ్యడానికి రెడీ , కానీ కమల్ హాసన్ డేట్స్ ఖాళీగా లేవు. కమల్ హాసన్ తో సినిమాకి ముందు కార్తీ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ కార్తీ డేట్స్ కూడా ఖాళీగా లేవు. గతం లో కార్తీ తో కలిసి ఆయన ‘ఖాకీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసాడు.
ఈ సినిమా తర్వాత అజిత్ తో రెండు సినిమాలు చేసాడు కానీ, అవి కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. తన దర్శకత్వం లో నటించడానికి ఒప్పుకున్న కమల్ హాసన్, కార్తీల డేట్స్ ఖాళీ లేదు. దీంతో సమయం వృధా చెయ్యకుండా, కమెడియన్ యోగిబాబు ని హీరో గా పెట్టి ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు డైరెక్టర్ హెచ్.వినోద్.. పొలిటికల్ నేపథ్యం లో సాగే సినిమా వినోదభరితంగా ఉంటుందట.