Dimple Hayathi : టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి.. సినిమాల విషయంలోనే కాకుండా ఓ వివాదంతోనూ ఇటీవలో వార్తల్లో నిలిచింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ విషయంలో వివాదం ఏకంగా కేసు వరకు వెళ్లింది. కాగా, డింపుల్ హయాతి బుధవారం ఓ ట్వీట్ చేసింది. హైదరాబాద్‍లో ట్రాఫిక్‍లో చిక్కుకున్నానని, ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ అంటూ పోస్ట్ చేసింది. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేసింది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

“పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటికి చేరుకునేందుకు గంట కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారు? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? హైదరాబాద్‍లో కాలు బయటపెట్టే పరిస్థితి ఉందా? ప్రభుత్వమా.. మాకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదు” అంటూ మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేసి ట్వీట్ చేసింది డింపుల్ హయాతి. దీంతో కొందరు నెటిజన్లు హయాతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ట్రాఫిక్ డీసీపీతో వ్యక్తిగత గొడవ కారణంగా హైదరాబాద్‍పై డింపుల్ హయాతి ట్వీట్ చేయడం పట్ల కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు.

“మీ గొడవలతో హైదరాబాద్‍పై నెగెటివ్‍గా ప్రచారం చేస్తారా” అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వివాదంగా మారుతుండటంతో ఆ ట్వీట్‍ను డింపుల్ హయాతి డిలీట్ చేసింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతికి కొంతకాలం క్రితం ఓ గొడవ జరిగింది. అపార్ట్‌మెంట్ పార్కింగ్‍లో ఉన్న తన కారును డింపుల్ తన కారుతో ఢీకొట్టిందని, తన కారును కాలితో కొట్టిందని ఆ డీసీపీ పోలీస్ స్టేషన్‍లో కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు పిలవటంతో వివరణ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‍కు కూడా వెళ్లింది డింపుల్. ఆ తర్వాత డీసీపీపై కోర్టుకు వెళ్లింది డింపుల్ హయాతి. ఆ విషయంలో తన తప్పేం లేదని, డీసీపీ దురుసుగా ప్రవర్తించారని న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.డింపుల్ హయాతీ చివరగా రామబాణం సినిమాలో హీరోయిన్‍గా కనిపించింది.