హీరోయిన్ డింపుల్ హయతి, ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేసే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో వీరికి తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన వాహనాన్ని కాలితో తన్ని, కారుతో ఢీకొట్టిందని డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డింపుల్ హయాతీపై 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసు పుణ్యమా అని ఒక ఊహించని విషయం బయటపడింది. కాగా ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియనే తెలియదు కానీ మొట్టమొదటిసారి రాహుల్ హెగ్డే, డింపుల్ హయతికి మధ్య జరిగిన ఈ గొడవలో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో చాలా మంది ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ జనాలు, నేటిజన్స్ సైతం డింపుల్ హయతి డేవిడ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారని అన్ని కుదిరితే త్వరలో వీళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకుంటారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఫైర్ వార్తలు తనపై వినిపించిన డింపుల్ హయతి గురించి మొట్ట మొదటిసారి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ గా మారుతూ చెక్కర్లు కొడుతుంది.
అయితే ఈ చిన్న గొడవ చినికిచినికి గాలివానగా మారింది. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మరో అడుగు ముందుకేసిన డింపుల్.. డీసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనను వేధిస్తున్నారని న్యాయపోరాటానికి సిద్ధమైంది. పార్కింగ్ ప్లేస్ కేంద్రంగా చెలరేగిన ఘర్షణలో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా డింపుల్ మీద పెట్టిన FIR కాపీ అందిందని ఆమె తరఫు లాయర్ పాల్ సత్యనారాయణ తెలిపారు. కారు కవర్ తీసినట్లు FIR లో పొందుపరిచారని.. అందుకు సంబంధించి ఆధారాలు ఉంటే తమకు చూపించాలన్నారు. డింపుల్ హయతి మీద కావాలని ఆరోపణలు చేయిస్తున్నారని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి వద్ద సంచరిస్తున్నారని పేర్కొన్నారు. తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయని.. నటి డింపుల్‌కు ప్రాణ హాని ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆమె లాయర్.