జ్యోతిష్యంపై మన దేశంలో చాలా నమ్మకం ఎక్కువ. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా జ్యోతిష్యాన్ని నమ్మేవారు పెరుగుతున్నారే కానీ తగ్గటం లేదు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యాలను చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి వేణు స్వామి. ఆయన జ్యోతిష్యం చెప్పటంతో పాటు సెలబ్రిటీల ఇళ్లలో పూజలు, యాగాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇప్పటికే రష్మిక మందన్న, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్స్‌తో వేణు స్వామి ప్రత్యేక పూజలు చేయించారు. ఇప్పుడీ లిస్టులో హీరోయిన్ డింపుల్ హయాతి కూడా చేరింది.

తాజాగా నటి డింపుల్ హయతి, వేణు స్వామి ద్వారా పూజలు చేయించుకుంది. అది కూడా అత్యంత రహస్యంగా. అయినప్పటికీ ఈ పూజల ఫొటోలు బయటకొచ్చాయి. రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకుంది డింపుల్ హయతి. అంతకంటే ముందు ఆమె నటించిన రామబాణం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకుంది ఈ బ్యూటీ. డింపుల్ కంటే ముందే వేణుస్వామిని ఆశ్రయించింది హీరోయిన్ నిధి అగర్వాల్.

పుష్కలంగా అందం ఉన్నప్పటికీ సరైన సక్సెస్ లేకపోవడంతో కెరీర్ బండి నడవడం లేదు. దీంతో ఈమె కూడా సీక్రెట్ గా వేణు స్వామిని ఆశ్రయించింది. తన జాతకం చూపించుకొని, ప్రత్యేకంగా గ్రహ దోష పూజలు చేయించుకుంది.ఈ గ్యాప్ లో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా వేణు స్వామిని కలిసింది. అతడి ఆశీస్సులు పొందింది. ఈమె పూజలు చేయించుకోలేదు కానీ, తన జాతకాన్ని చూపించుకుంది. ఎప్పటికప్పుడు వేణు స్వామితో టచ్ లోనే ఉంటోంది. ఇలా టాలీవుడ్ కు చెందిన హీరోయిన్లంతా ఇప్పుడు వేణు స్వామి వెంట పడుతున్నారు.