Dil Raju : ‘హనుమాన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా చిరంజీవి థియేటర్ల గురించి మాట్లాడారు. ఇది కూడా దిల్ రాజును ఉద్దేశించే అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై దిల్ రాజు నేరుగా స్పందించారు. మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆయన ఒక సినిమా ఫంక్షన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..
‘ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్నో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడల్లా డైరెక్ట్‌గానో, లేకపోతే ఇన్‌డైరెక్ట్‌గానో నా మీద కాంట్రవర్సీలు చేస్తూనే ఉన్నారు. రాళ్లు విసురుతూనే ఉన్నారు. అది మీకు తెలియనిది కాదు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఇది నడుస్తూనే ఉంది. నేను కష్టపడి ఎదిగి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. నిన్న చిరంజీవి మాట్లాడుతూ ఎంత బాగా చెప్పారు. దిల్ రాజుకు ఎప్పుడు ఎలా ఏం చేయాలో బాగా చెప్పారు. అతను చాలా అనుభవం గల వ్యక్తి అన్నారు. కానీ ఈరోజు కొన్ని వెబ్ సైట్లలో చిరంజీవి మాట్లాడిన దాన్ని ఇంకో లాగా టర్న్ చేసి రాశారు. అవి రెండూ ప్రముఖ వెబ్ సైట్లే.
మీ వెబ్ సైట్ ఇంపార్టెన్స్‌ను పెంచుకోవడానికి నాపైన ఎందుకు ఏదేదో రాస్తున్నారు? మీకిది అవసరమా? దిల్ రాజు ఏమీ రియాక్టవ్వడు. సాఫ్ట్‌గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా. ఎందుకిలా… సాఫ్ట్‌గా వెళ్దాం అని. ఆ నిర్మాత వచ్చి మీతో మాట్లాడాడా? మీకు దమ్ముంటే ఆ నిర్మాతని, నన్ను ఈ స్టేజ్ పైన కూర్చోబెట్టి ప్రశ్నలు వేయించండి. ప్రతి సంక్రాంతికి నన్నే ఎందుకు టార్గెట్ చేయాలి? ఇంత మంది నన్ను అభిమానిస్తున్నారు. 95 శాతం మంది నన్ను అభిమానిస్తున్నారు. మిగతా ఐదు శాతం గురించి నాకు తెలీదు. అది వాళ్ల ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ శాటిస్ఫై చేయలేను. శాటిస్ఫై చేస్తున్నాను కాబట్టే ఈరోజు నాకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.’