హీరోగా ఏంటి ఇచ్చి ఇక ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న అక్కినేని హీరో సుశాంత్. హీరోగా పెద్దగా కలిసి రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అందుకోవచ్చు అనడానికి ఇతను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలవైకుంఠపురంలో స్ట్రాంగ్ సైడ్ క్యారెక్టర్ ప్లే చేసిన సుశాంత్ ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవితో కలిసి బోలా శంకర్ లో నటిస్తున్నాడు.

ఈ మూవీ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడ డంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది. ప్రమోషన్ లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుశాంత్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. మనం ఏది ప్లాన్ చేయలేము. హీరో, గెస్ట్ రోల్ లేక సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను. అలవైకుంఠపురం మూవీ లో నన్ను సరికొత్త యాంగిల్ లో త్రివిక్రమ్ చూపించారు.”ఆ మూవీలో నటిస్తున్న సమయంలో నేను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను. ఇక రావణాసుర చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రలో నటించే అవకాశం దక్కింది. బోలా శంకర్ విషయానికి వస్తే డైరెక్టర్ మెహర్ రమేష్ ఒకసారి నాకు కాల్ చేసి మూవీ గురించి వివరించారు.
చిరంజీవి గారితో ఒక పాట నటించే అవకాశం ఉండడంతో వెంటనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను” అని అన్నారు.సుశాంత్..బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మెయిన్ కథాంశంగా సాగే ఈ చిత్రం లో అతిథి పాత్ర పోషించినప్పటికీ చిరంజీవి, కీర్తి సురేష్ మరియు తమన్నాలతో కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
సుశాంత్ హీరోగా నటించిన మొదటి సినిమా కాళిదాసులో తమన్నా హీరోయిన్గా చేసింది. ఈ చిత్రం విడుదలై 15 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అప్పుడు ప్రేమికులుగా చేసి ఇప్పుడు ఈ చిత్రంలో వీళ్ళిద్దరూ బ్రదర్ సిస్టర్ గా చేయబోతున్నారు. ఇది తనకు ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ అని సుశాంత్ పేర్కొన్నారు.