Uday Kiran ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ని అందుకొని, అప్పటి స్టార్ హీరోలతో సమానమైన హోదా ని దక్కించుకున్న హీరో ఉదయ్ కిరణ్.ఈయన అప్పట్లో తీసే సినిమాలలో ఎక్కువ శాతం విజయం సాధించినవే ఉన్నాయి.అలా కెరీర్ దూసుకుపోతున్న సమయం లో ఆయనకీ వరుసగా ఫ్లాప్స్ రావడం మొదలయ్యాయి.దాంతో సినిమాల్లో అవకాశాలు కోల్పోయి, నిజ జీవితం లో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ని మన తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి సరైన కారణం ఇప్పటి వరకు బయటపడలేదు కానీ, సోషల్ మీడియా లో రకరకాల కథనాలు ఇప్పటికీ తిరుగుతూనే ఉంటాయి.అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఆయన భార్య విషిత ఏమైంది..?, మరో పెళ్లి చేసుకుందా..?, ఇప్పుడు అసలు ఆమె ఏమి చేస్తుంది వంటి విషయాలేవీ ఎవరికీ తెలియదు.కానీ మాకు దొరికిన కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉదయ్ కిరణ్ భార్య గురించి సేకరించిన కొన్ని వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

విషిత ఉదయ్ కిరణ్ ని పెళ్లి చేసుకోకముందు నుండే ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో మంచి స్థాయి లోనే ఉద్యోగం చేస్తుండేది.ఉదయ్ కిరణ్ ని ఒక ఫంక్షన్ లో చూసి పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లివరకు దారి తీసింది.అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఈమె మరో పెళ్లి చేసుకోలేదట.అతని జ్ఞాపకాలతోనే కాలం గడిపేస్తుందట, ఉదయ్ కిరణ్ జయంతి వచ్చినప్పుడల్లా ఆమె అనాధాశ్రమం కి వెళ్లి దానధర్మాలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి చేస్తూ ఉండేదట.

ప్రస్తుతం కూడా ఆమె ఒక ప్రముఖ MNC సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తుందట.నెలకి రెండు లక్షల రూపాయలకు పైగానే శాలరీ ఉంటుందని సమాచారం.ఆమెకి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవు, తన తల్లిదండ్రులతో కలిసి బ్రతుకుతూ ప్రశాంతవంతమైన జీవితం ని కొనసాగిస్తుంది.ఆమె చివరి సారిగా మీడియా కి కనిపించిన ఫోటో ఒకటి ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
