Upasana ఆస్కార్ ఈవెంట్ లో ఉపాసన ధరించిన ఈ నెక్లెస్ ని తయారు చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టిందో తెలుసా?

- Advertisement -

Upasana : RRR మూవీ కి నిన్న ఆస్కార్ అవార్డు దక్కడం అనేది యావత్తు భారతదేశ సినీ ప్రియుడికి ఎంతో గర్వకారణం. రాజమౌళి విజన్ కి తగ్గట్టు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్, అలాగే మూవీ టీం మొత్తానికి ఎన్ని సార్లు కృతఙ్ఞతలు చెప్పినా అది తక్కువే అవుతుంది. తెలుగు సినిమా పేరు చెప్తే ప్రతీ భారతీయుడు గర్వపడే స్థాయికి కారణమైన RRR మూవీకి సంబంధించి ఏ విషయమైనా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినది.

Upasana
Upasana

మనకే ఇంత గర్వంగా ఉంటే, ఇక ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికి ఎంత గర్వం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ముఖ్యంగా హీరోలకు. వాళ్లకి నిన్న ఆస్కార్ అవార్డు ఈవెంట్ లో గడిపిన ప్రతీ క్షణం ఎంతో విలువైనది. అందుకోసమే అటు ఎన్టీఆర్ కానీ, ఇటు రామ్ చరణ్ కానీ తమ కాస్ట్యూమ్స్ ని కూడా ఎంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు.

Upasana necklace

వాళ్ళిద్దరి కాస్ట్యూమ్స్ సంగతి కాసేపు పక్కన పెడితే, రామ్ చరణ్ భార్య ఉపాసన కాస్ట్యూమ్స్ ఎన్నో ప్రత్యేకతలతో తయారు చేయబడినది అట. మన భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా శాంతికి చిహ్నంగా నిల్చిన తెలుపు రంగు తో తన చీర ని తయారు చేయించుకుంది. జ‌యంతి రెడ్డి డిజైన్ చేసిన‌ స్క్రాప్ రీసైలిక్డ్ సిల్క్ శారీ ని ధరించిన ఉపాసన నిన్న ఆస్కార్ ఈవెంట్ కి హాజరైన ప్రతీ సెలబ్రిటీ ని ఆకర్షించారు.

- Advertisement -
Ram charan upasana

అంతే కాదు , ఈ చీరపై గ్రాండ్ లుక్ వచ్చేందుకు ఆమె ధరించిన నెక్లెస్ 400 కేర‌ట్ల హై క్వాలిటీ రూబీస్‌ (400 carats of high-quality rubies), జెమ్ స్టోన్స్, ముత్యాలతో చేయించిన విలువైన నగ అది. ఈ నెక్లెస్ ని డిజైన్ చెయ్యడానికి సుమారుగా నాలుగేళ్ల సమయం పట్టిందట. అందుకోసం ఆమె 10 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం. ఆస్కార్ అవార్డ్స్ కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మరియు ఆభరణాల ప్రత్యేకతలు గురించి రామ్ చరణ్ మరియు ఉపాసన ఏమి మాట్లాడారో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here