Shriya Saran : టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడేలా చేసుకుంది. పలు భాషల్లో టాప్ హీరోల అందరి సరసన నటించి అగ్రహీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికి పలు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే అవసరమైనప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే పర్సనల్ విషయానికి శ్రియకు ఓ బ్రదర్ ఉన్నాడని చాలామందికి తెలుసు.. కానీ ఆమెకు ఓ సిస్టర్ కూడా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆమె పోలికలతో చూడడానికి శ్రియలాగానే కనిపించే ఓ అమ్మాయి మెరిసింది.

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రియ తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా అక్కడకు వెళ్లారు. శ్రియతో పాటు ఆమె తల్లి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక వారితో పాటు మరో అమ్మాయి కూడా కనిపించింది. ఆమె చూడడానికి శ్రియలా అనిపిస్తుంది. స్మైల్ అండ్ ఫేస్ చూస్తే శ్రియ సిస్టర్ లా ఉందనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

అయితే శ్రియకి సొంత సిస్టర్ అవుతుందా.. లేదా సిబ్లింగ్ అవుతుందా.. అనేది తెలియదు. ఇక అచ్చం ఆమెలాగే ఉన్న సిస్టర్ ను ఇన్నాళ్ల వరకు కెమెరా ముందుకు తీసుకురావకుండా.. సడన్ గా కెమెరా ముందుకు తీసుకురావడంతో ప్రస్తుతం ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకే శ్రియ కెమెరా ముందుకు తీసుకువచ్చిందని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.