Sreeleela : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల యూత్ మొత్తం శ్రీలీల పేరు చెప్తే ఎంతలా వెర్రెక్కిపోతారో మన అందరికీ తెలిసిందే. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరికి ఇప్పుడు శ్రీలీలనే కావాలి. కానీ ఈమధ్య ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేక, అవకాశాలు వస్తున్నాయి కదా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొని వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంది. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘గుంటూరు కారం’ చిత్రం పైనే.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈమె పక్కన ఉంది, ఎలా అయినా పోటీ ఇవ్వాలని ఏమో తెలియదు కానీ మహేష్ బాబు ఈ సినిమా డ్యాన్స్ ఇరగకుమ్మేసాడు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల దశ మారిపోయినట్టే, ఫ్లాప్ అయితే మాత్రం ఇక ఆమె కెరీర్ ముగిసింది అనుకోవచ్చు.

అయితే రీసెంట్ గా శ్రీలీల కట్టిన కిటికీల చీర ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చీర చాలా వెరైటీ గా ఉంది, ఎంత ఉంటుందో చూద్దాం అని గూగుల్ లో వెతికిన వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎందుకంటే దాని ధర అక్షరాలా ఒక లక్ష 54 వేల రూపాయిలు అట. ఈ రేంజ్ ధర ఉన్న చీరని సామాన్యులు ఎవరు కొనగలరు చెప్పండి. శ్రీలీల ఒక్కో సినిమాకి 3 నుండి 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

కాబట్టి ఆమె వాడే వస్తువులు, వేసుకునే దుస్తులు అన్నీ అదే రేంజ్ ఖరీదుతో ఉంటాయి. మిడిల్ క్లాస్ కుటుంబానికి ఒక నెలలో లక్ష రూపాయిల జీతం వస్తే ఎదో ఒక వరం దక్కినట్టు ఫీల్ అవుతారు. అలాంటిది శ్రీలీల కట్టుకునే చీరలే ఇంత రేట్ ఉన్నాయి, ఆమె రేంజ్ కి ఎప్పుడు ఎదుగుతామో అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.