Tejaswini : యూట్యూబ్ ద్వారా అమర్ దీప్ భార్య ‘తేజస్విని’ సంపాదించిన డబ్బుతో ఒక సినిమా తీసేయొచ్చు తెలుసా!

- Advertisement -

Tejaswini : ఈమధ్య కాలం లో సినీ సెలెబ్రెటీలకు సినిమాలు సీరియల్స్ ద్వారా ఎంత డబ్బులు వస్తున్నాయో తెలియదు కానీ, యూట్యూబ్ మరియు ఇంస్టాగ్రామ్ నుండి మాత్రం నెలకు లక్షల్లో సంపాదించేస్తున్నారు. చిన్న హీరోయిన్స్ దగ్గర నుండి పెద్ద హీరోయిన్స్ వరకు కేవలం సెలబ్రిటీ అయితే చాలు, లక్షల రూపాయిలు నెలకు ఒళ్ళో వచ్చి పడుతున్నాయి.

అలా కన్నడ బ్యూటీ, పాపులర్ తెలుగు సీరియల్ హీరోయిన్, బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ భార్య తేజస్విని యూట్యూబ్ లో పెద్ద సెలబ్రిటీ గా 16 లక్షల మంది సస్క్రైబర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఈమె తమిళం లో ఎన్నో సీరియల్స్ చేసింది, తెలుగు లో రెండు సీరియల్స్ చేసింది, కన్నడ లో ఒక సీరియల్ చేసింది. పలు డ్యాన్స్ షోస్ మరియు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా పాల్గొంది. ఇలా ఇన్నిటి మీద ఈమె సంపాదించిన డబ్బుల కంటే ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ నుండి సంపాదించింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈమె ఒక్కో వీడియో కి కనీసం 10 లక్షల వ్యూస్ వస్తాయి, ఆమెకి ఉన్న బిజీ కారణంగా ఈమధ్య కాలం లో ఎక్కువగా వీడియోస్ చెయ్యట్లేదు కానీ, పాత వీడియోస్ నుండి ఈమెకి వస్తున్న సంపాదన మామూలుది కాదు. నెలకు ఈమె యూట్యూబ్ ద్వారా దాదాపుగా 30 లక్షల రూపాయలకు పైగా డబ్బులు సంపాదిస్తున్నట్టు సమాచారం. అంటే సంవత్సరానికి దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయిలు అన్నమాట.

- Advertisement -

ఆ డబ్బులతో ఆమె టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను పెట్టి ఒక చిన్న సినిమానే తియ్యొచ్చు. లేకపోతే ఆమె రెగ్యులర్ గా చేసే టీవీ సీరియల్ ని కూడా నిర్మించొచ్చు. ఆ రేంజ్ డబ్బులు వస్తున్నాయి కాబట్టే ఈమధ్య టీవీ సీరియల్స్ హీరోయిన్స్ అందరూ యూట్యూబ్ చానెల్స్ ని పెట్టుకుంటున్నారు. ప్రియాంక జైన్ మరియు శోభా శెట్టి వంటి వారు కూడా యూట్యూబ్ చానెల్స్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here