Upasana : క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ ధరతో ఒక సినిమా తీసేయొచ్చు తెలుసా!

- Advertisement -

Upasana : రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తనకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో ఫోటోల రూపంలోనో,లేదా వీడియోల రూపంలోనో అప్డేట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమెకి క్లిన్ కారా అనే చిన్నారి పుట్టిన తర్వాత ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రతీ రోజు పండుగలాగానే ఆమె జీవితం ని ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఏదైనా పెద్ద పండగ వచ్చినప్పుడు కళ్ళు జిగేలుమనిపించే అవుట్ ఫిట్స్ తో దర్శనమిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. రీసెంట్ గానే మెగా కుటుంబం మొత్తం క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా, మిగిలిన వాళ్ళందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంతమంది ఉన్నప్పటికీ ఉపాసన అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చింది.

అందుకు కారణం ఆమె ధరించిన డ్రెస్ అనే చెప్పాలి. ఎరుపు రంగులో చూసేందుకు చాలా సింపుల్ అవుట్ ఫిట్ లాగ అనిపిస్తున్న ఈ డ్రెస్ ధర లక్షల్లోనే ఉంటుందట. ఆన్లైన్ లో అభిమానులు ఈ డ్రెస్ ని వెతకగా అక్షరాలా మూడు లక్షల రూపాయిలు అని తెలిసింది . సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి ఇది చాలా పెద్ద అమౌంట్. కానీ డబ్బున్న సెలబ్రిటీస్ కి చాలా తక్కువ.

- Advertisement -

ఇదే మూడు లక్షల రూపాయలతో ఒక మంచి కథని ఎంచుకొని షార్ట్ ఫిలిం లాంటిది తీసేయొచ్చు అని కొంతమంది నెటిజెన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గానే ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి ఫోర్బ్స్ మ్యాగైన్ లో కనిపించడం పెద్ద సంచలనం గా మారింది. ఇలా సెలబ్రిటీస్ సతీమణులలో ఫోర్బ్స్ లాంటి మ్యాగైన్ కవర్ పేజీ మీద కనపడింది కేవలం ఉపాసన మాత్రమే అని అంటున్నారు అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here