Kamal Haasan రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, హిందీ, తమిళం, మలయాళం లో కూడా ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. సినిమాకి ప్రభాస్ స్టామినా తో పాటుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే స్టార్ స్టేటస్ లు కూడా బాగా ఉపయోగపడ్డాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ బచ్చన్ హైలైట్ అయ్యాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా అమితాబ్ అని ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా తెలపడం కూడా మనమంతా చూసాము.
అయితే హిందీ భాషలో వసూళ్లు ఆ స్థాయిలో రావడానికి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంత ఉపయోగపడిందో, తమిళం లో కూడా మంచి వసూళ్లు రావడానికి కమల్ హాసన్ పాత్ర అంతలా ఉపయోగపడింది. సుప్రీమ్ యాస్కీన్ పాత్రలో ఆయన సినిమాలో కనిపించింది అతి తక్కువ నిడివి అయ్యినప్పటికీ కూడా సినిమా పై మంచి ప్రభావమే చూపించింది. ముఖ్యంగా ఆయన గెటప్ చాలా కొత్తగా, భయంకరంగా ఉంటుంది. ఈ మేకప్ వేసుకోవడానికి ఆయనకీ దాదాపుగా రెండు నుండి మూడు గంటల సమయం పట్టేదట. కేవలం ఈ ఒక్క మేకప్ కోసమే రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యిందని సమాచారం. అంత భారీ మొత్తం తో ఒక్క మీడియం రేంజ్ హీరోతో ఒక్క చిన్న సినిమానే తీసేయొచ్చు.
గెటప్స్ మీద కమల్ హాసన్ కి ఎంతో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొత్తగా కనిపించడం కోసం ఆయన ఎంత కష్టమైన మేకప్ ని వేసుకోడానికి సిద్ధపడుతారు. దశావతారం చిత్రం లో ఎన్ని గెటప్స్ వేశాడో మన కళ్లారా చూసాము. ఇలా కమల్ హాసన్ గెటప్స్ గురించి చెప్పుకుంటూ పోతే రోజు కూడా గడిచిపోతుంది. ఇది ఇలా ఉండగా కల్కి సక్సెస్ గురించి కమల్ హాసన్ ఎంతో ఆనందం ని వ్యక్త పరుస్తూ రీసెంట్ గా ఒక వీడియోని విడుదల చేసాడు. ఈ వీడియో లో ఆయన మాట్లాడుతూ కల్కి రెండవ భాగం లో సుప్రీమ్ యాస్కీన్ విశ్వరూపం చూసి ఆడియన్స్ భయపడిపోతారు అంటూ ప్రత్యేకించి చెప్పాడు. ఇప్పటికే 60 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. మిగిలిన కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.