Mahesh Babu : నిన్న ముంబై లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఎంత గ్రాండ్ గా జరిగిందో మన అందరికీ తెలిసిందే. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటుగా ఇంత వ్యాపార రంగాలకు సంబంధించిన దిగ్గజాలు ఈ వివాహ మహోత్సవం లో పాల్గొన్నారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. అయితే ఎంతమంది ప్రముఖులు వచ్చినా కూడా, కేవలం మహేష్ బాబు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నిన్న ఆయన ధరించిన దుస్తులు మరియు గెటప్ ని చూసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు మహేష్ బాబు ఇలాంటి లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు. పొడవాటి జుట్టుతో, గుబురు గెడ్డంతో, హాలీవుడ్ యాక్షన్ హీరోలాగా ఆయన కనిపించడంతో అందరి ద్రుష్టి మహేష్ బాబు మీదనే పడింది.
ఆయన తన తదుపరి చిత్రం డైరెక్టర్ రాజమౌళి తో చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన లుక్ కోసమే మహేష్ బాబు ఇలా తయారు అయ్యాడని, ప్రతీ రోజు జరుగుతున్న వర్క్ షాప్ లో కూడా ఆయన పాల్గొంటున్నాడని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ధరించిన ఈ దుస్తుల విలువ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులను విశేషంగా ఆకర్షించిన ఈ దుస్తుల ధర ఎంత ఉంటుందో చూద్దామని గూగుల్ లో వెతకగా సుమారుగా ఆరు కోట్ల రూపాయిలు ఉంటుందని తెలిసింది. ఆరు కోట్ల రూపాయిలు అంటే, ఒక మీడియం రేంజ్ హీరో తో సినిమా కూడా చేసేయొచ్చు.
సాధారణంగా మహేష్ బాబు ఎక్కడికి వెళ్లినా చాలా సాధారణమైన దుస్తులు వేసుకొని వెళ్తాడు. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే ఆయన తీరు ఇలాగే ఉంటుంది. కానీ అంబానీ కుటుంబం కి సంబంధించిన వివాహం కావడం తో ఇంత ఖరీదైన దుస్తులను ధరించడాన్ని అంటున్నారు అభిమానులు. ఇకపోతే మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందట. కానీ డైలాగ్ వెర్షన్ స్క్రిప్ట్ ఇప్పటి వరకు మొదలు పెట్టలేదట. ఈ చిత్రానికి సంబంధించి ఎదో ఒక అధికారిక అప్డేట్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9 వ తారీఖున వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అది దాదాపుగా సాధ్యం కాదని తెలుస్తుంది.